hyper aadi seets how many cores

“హైపర్ ఆది” ఆస్తి అన్ని కోట్లా….ఇది నిజమేనా…???

హైపర్ ఆది ఈ పేరు తెలియని తెలుగు రాష్ట్రాల ప్రజలు ఉంటారా, సినిమాలలో స్టార్ కమెడియన్ కు ఎంత క్రేజ్ ఉండే బుల్లి తెరపై కమెడియన్స్ లో ఆది కి  క్రేజ్ ఆ రేంజ్ లోనే ఉంటుంది. జబర్దస్త్ షో ద్వారా ఎంతో పాపులర్ అయిన ఆది డబుల్ మీనింగ్ డైలాగులు వేస్తూ, తన పాపులారిటీ ని పెంచుకుంటూ వచ్చాడు. తన స్కిట్ లలో ఒకింత వర్గారిటీ కనిపించినా జనాలు షో ను ఆదరించడంతో మనోడు పాపులారిటీ సంపాదించాడు. అంతేకాదు బుల్లి తెరపై అత్యధిక రెమ్యునిరేషన్ తీసుకునే కమెడియన్స్ లో ఆది కూడా ఒకరట. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఆది ఆస్తులపై ఓ టాక్ నడుస్తోంది. అదేంటంటే

Jabardasth Hyper Aadi Reacts To The Fake Rumors Spreading About Him On  Social Media - Lovely Telugu

ఇండస్ట్రీ లోకి వచ్చిన రోజు మొదలు ఇప్పటి వరకూ ఆది ఎంత సంపాదించాడు అనేది హాట్ టాపిక్ అవుతోంది. గతంలో చిన్న సొంత ఇల్లు ఉన్న ఆది ఇప్పుడు హైదరాబాద్ లో లగ్జరీ హౌస్ లో ఉంటున్నాడని ఆ ఇంటి విలువ అక్షరాలా రూ.10 కోట్లు ఉంటుందనే టాక్ వినిపిస్తోంది.అంతేకాదు లగ్జరీ కార్లతో పాటు పలు చోట్ల ఆది స్థలాలు కొనుగోలు చేసారని, అన్నీ లెక్కేసుకుంటే రమారమి ఆది ఆస్తుల విలువ రూ.50 కోట్లు పై మాటేనని తెలుస్తోంది. ఇదిలాఉంటే

Finally, Hyper Aadi Confirms His Marriage Plans

ఆది సన్నిహితులు మాత్రం ఇవన్నీ పుకార్లు మాత్రమేనని కొట్టి పారేస్తున్నారు. కాగా గతంలోలా ఆది కి పెద్ద క్రేజ్ ఉండటం లేదు. ఇదివరకు ఆది వేసే పంచ్ డైలాగులు స్కిట్ కి తగ్గట్టుగా హాస్యాస్పదంగా ఉండేవి, కానీ ఈ మధ్య కాలంలో ఆది పంచ్ డైలాగులలో వల్గారిటీ ఎక్కువ అవుతోంది, ఆడవారి పై డబుల్ మీనింగ్ పంచ్ లు వేస్తూ కొంత వెగటు పుట్టిస్తున్నట్టుగా కూడా అనిపిస్తోంది. ఏది ఏమైనా ఆది అన్ని కోట్లు ఆస్తులు వెనకేసుకుంటే మంచిదేగా, అదృష్టం అందరికి రాదు కదా అంటూ ఫ్యాన్స్ మాత్రం ఆదిని సపోర్ట్ చేస్తున్నారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *