బిడెన్ గెలిస్తే భారత్ కు భారీ నష్టం తప్పదా..??

అమెరికా అధ్యక్ష ఎన్నికలలో జయాపజయాలు కేవలం భారతీయుల ఓట్లపై ఆధారపడి ఉన్నాయి. ఈ ఎన్నికల్లో ట్రంప్ గెలుస్తాడా, లేక బిడెన్ గెలుస్తాడా అనడిగితే ఎవరైనా బిడెన్ గెలుపు ఖాయమని అంటారు. కానీ వచ్చే ఎన్నికల్లో విజయావకాశాలు అత్యధికంగా ట్రంప్ కి మాత్రం ఉన్నాయని అంటున్నారు రాజకీయ పండితులు. అదేంటి అన్ని సర్వేలు దాదాపు బిడెన్ వైపు మొగ్గు చూపడమే కాకుండా అధ్యక్షుడు బిడెన్ అంటూ డంకా మోగించి చెప్తుంటే ట్రంప్ ఎలా గెలుస్తాడు అనే సందేహం రావచ్చు అందుకు ప్రధాన కారణం ఒకే ఒక్క కాశ్మీర్ అంశం. ఈ వాదన ఇప్పుడు తెరపైకి వచ్చింది.

Difficult to attack vanilla': Trump's throwing everything at Biden, but  nothing is sticking

ఏఏపీఐ అనే సంస్థ చేసిన సర్వే ప్రకారం. ఇండో అమెరికన్స్ బిడెన్ కి మద్దతు ఇవ్వనున్నారని ప్రకటించింది. అలాగే ట్రంప్ కు బిడెన్ కి వచ్చిన స్థాయిలో భారతీయ ఇండియన్స్ నుంచీ మద్దతురాలేదని అయితే గత ఎన్నికలతో పోల్చుకుంటే ట్రంప్ కి ఊహించని స్థాయిలో ఇండో అమెరికన్స్ మద్దతు భారీగా వచ్చిందని కూడా ప్రకటించింది. అందుకు గల కారణాన్ని కూడా సదరు సర్వే తెలిపింది. కేవలం బిడెన్ కాశ్మీర్ అంశంలో తలదూర్చడం కారణంగానే ట్రంప్ కి మద్దతు పెరిగిందని చాలామంది భారతీయ ఎన్నారైలు బిడెన్ ని కాశ్మీర్ విషయంలో వ్యతిరేకిస్తున్నారని అంటున్నారు.

India-U.S. ties not targeted against Pakistan: Biden - The Hindu

బిడెన్ అనవసరంగా కాశ్మీర్ అంశంలో వేలు పెట్టాడని ఇప్పుడు డెమోక్రాట్లు తలలు పట్టుకుంటున్నారు. కాశ్మీర్ ప్రత్యేక హోదాని రద్దుచేస్తూ భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో డెమోక్రాట్లు ఏకీభవించలేదు, ట్రంప్ ఈ విషయంలో భారత్ కి సంపూర్తిగా మద్దతు ఇచ్చి భారతీయుల మనసు గెలుచుకున్నాడు. కాశ్మీర్ అంశంలో మూడవ వ్యక్తి తలదూర్చడానికి ఇష్టపడిన సమయంలో తాను ఈ సమస్యని పరిష్కరించగలనని బిడెన్ వ్యాఖ్యలు చేయడంతో అప్పట్లో పెద్ద దుమారమే రేగింది. పాక్ కి మద్దతుగా బిడెన్ వ్యవహరిస్తున్నట్లుగా ప్రవర్తించడం అలాగే సిఏఏ లాంటి వాటిపై బిడెన్ సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు.

India denies Trump claims of talks with PM Modi over China logjam

మొదటి నుంచీ భారత్ పై బిడెన్ విద్వేషంగానే ఉంటూ వచ్చారు. ఒక వేళ బిడెన్ అధ్యక్షుడు అయితే పాక్ రెచ్చిపోతుందని చెప్పడంలో సందేహం లేదని నిపుణులు బల్లగుద్ది మరీ చెప్తున్నారు. అంతేకాదు అమెరికా భారత్ మధ్య ఉన్న భందాలు అన్నీ బిడెన్ అధ్యక్షుడు అయితే దెబ్బతినే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. దాంతో బిడెన్ విజయం సాధించకూడదని ప్రతీ ఒక్క భారతీయుడు కోరుకుంటున్నారనేది కొన్ని సర్వే సంస్థలు కూడా తేల్చి చెప్పాయి. ఏది ఏమైనా బిడెన్ గెలిస్తే భవిష్యత్తులో భారత్ కి భారీ నష్టం తప్పదనేది విశ్లేషకుల వాదన.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *