IMDb టాప్ 250 ఇండియన్ ఫిలిమ్స్…..బాహుబలి, RRR లను వెనక్కి నెట్టిన చిన్న సినిమా ఇదే…!!
ఏ సినిమా విడుదలైనా సరే IMDb రేటింగ్ ఎలా ఉందని సినిమా ప్రేక్షకులు ఆత్రుతగా ఎదురు చూస్తారు అంతెందుకు IMDb రేటింగ్ చూసి మరీ సినిమాకు వెళ్ళే వాళ్ళు లేకపోలేదు. తాజాగా ఈ ఎంటర్టైన్మెంట్ పోర్టల్ ఇండియన్ ఫిలిమ్స్ లో బెస్ట్ 250 లిస్టు ను ప్రకటించింది. తమ పోర్టల్ లో యూజర్స్ ఇచ్చే ఫీడ్ బ్యాక్ ఆధారంగా చేసుకుని ఓ లిస్టు ను రూపొందించింది. అయితే అందరూ ఊహించినట్టుగానే టాప్ 250 ఇండియన్ ఫిలిమ్స్ లో మొదటి స్థానాన్ని సంపాదించింది తాజాగా విడుదలైన కన్నడ కాంతారా. ఈ సినిమా విడుదలైన రోజు మొదలు విమర్శకులు సైతం ప్రశంసల వర్షం కురిపించడంతో ఈ సినిమాకు జనం పోటెత్తారు. దాంతో ఈ సినిమా IMDb రేటింగ్ లో టాప్ సినిమాగా నిలిచింది. ఇక
2వ స్థానంలో 1993 లోని రామాయణ నిలువగా, 3వ స్థానంలో 2022 లో రిలీజ్ అయిన రాకెట్రీ చోటు దక్కించుకుంది. 4వ స్థానంలో నాయకన్, 5వ స్థానంలో అన్బే శివం , 6 లో గోల్ మాల్, నిలువగా, తమిళ నటుడు సూర్యా నటించి తెలుగులో కూడా హిట్ అయిన జై భీమ్ 7వ స్థానంలో నిలిచింది. ఇక 8 వ స్థానంలో దియేటర్లో కన్నీళ్లు పెట్టించిన చార్లీ 777 నిలిచింది. అయితే మన తెలుగు సినిమాల విషయంలోకి వస్తే

భారీ భారీ హిట్ లు కొట్టి, కమర్షియల్ గా ఓ ఊపు ఊపేసిన బాహుబలి( మొదటి, రెండవ భాగాలు) RRR, లు మహేష్ పోకిరీ, ఒక్కడు, అర్జున్ రెడ్డి, పెళ్లి చూపులు ఇలాంటి తోపు సినిమాలను పక్కకు నెట్టి చిన్న సినిమా అయిన కేరాఫ్ కంచర పాలెం 17 వ స్థానంలో నిలిచింది. బొమ్మరిల్లు, రంగస్థలం, అతడు, వేదం, మనం , ఊపిరి, క్షణం, గూడచారి ఇలా అన్ని సినిమాలు కేరాఫ్ కంచర పాలెం తరువాతే నిలిచాయి.