లక్కంటే ఇదీ…భారతీయుడికి భంపర్  లాటరీ…అక్షరాలా…

అదృష్టం ఎప్పుడు తలుపు తడుతుందో చెప్పలేం. మనం తలుపు తీసేవరకూ అది కొడుతూనే ఉంటుంది. దురదృష్టం కూడా అంతే అనుకోండి..కానీ ప్రస్తుతం ఇప్పుడు మనం చెప్పుకునేది దేశం కాని దేశంలో భారతీయుడికి ఎదురైన అదృష్టం గురించి. లక్కు సహజంగా అందరికి వచ్చేదే కానీ ఈ మన భారతీయుడికి మాత్రం లక్కుకే అమ్మ మొగుడు లాంటి లక్కు వచ్చి మీద పడింది. ఇక అతడి ఆనందానికి అవధులు ఎక్కడ ఉంటాయి చెప్పండి. సరే ఇక అసలు విషయంలోకి వెళ్తే..

Indian expat from Kuwait wins Dh12 million in UAE's Big Ticket raffle | Uae  – Gulf News

పొట్ట కూటికోసం దుబాయ్ వెళ్లి అక్కడ ఓ వైద్య పరికరాలు అమ్మే కంపెనీలో సెల్స్ మెన్ గా పనిచేస్తున్న జాకబ్స్ కు అక్కడి బిగ్ టిక్కెట్ లాటరీ కొనడం అలవాటు. గత రెండేళ్లుగా ఈ లాటరీను కొనుగోలు చేస్తూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. తన ఫ్యామిలీ తో సరదాగా బయటకి వెళ్ళిన సమయంలో  సదరు బిగ్ టిక్కెట్ నిర్వాహకులు జాకబ్స్ కు ఫోన్ చేసి తాను రూ. 24 కోట్ల లాటరీ గెలుచుకున్నట్టుగా తెలిపారు…కానీ

This Indian expat wins Dubai raffle jackpot worth Dh 12 mn, turns  multi-millionaire instantly, says 'I cannot believe it' - The Financial  Express

జాకబ్స్ స్నేహితులు ఎప్పటిలా ఆటపట్టిస్తున్నారు అనుకున్న కారణంగా పట్టించుకోలేదు. కానీ వరుసగా వారి నుంచి ఫోన్స్ రాగా హుటాహుటిన వెళ్ళిన జాకబ్స్ కు అది నిజమని తెలిసి ఉబ్బితబ్బిబ్బై పోయాడు. కలలో కూడా ఇంత పెద్ద మొత్తం లాటరీ రూపంలో వస్తుందని అనుకోలేదని సంతోషం వ్యక్తం చేశాడు. తనకు కొన్ని అప్పులు ఉన్నాయని వాటిని తీర్చిన తరువాత తన పిల్లల చదువులకు కొంత సొమ్ము దాచి ఉంచుతతాని, మిగిలింది, సొంత ఇల్లు సమాజ సేవ కోసం ఖర్చు చేస్తానని అన్నాడు జాకబ్స్.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *