ఇంటర్ పాస్ అయ్యారా…నేవీ లో ఉద్యోగాలు మీకోసమే…చివరితేదీ

భారత దేశ రక్షణ రంగంలో ఓ భాగమైన, అత్యంత కీలకమైన విభాగం ఇండియన్ నేవీ. నేవీలో పనిచేయాలని ఎంతో మంది యువత ఆరాటపడుతుంటారు అందుకోసం ప్రత్యేక శిక్షణ కూడా పొందుతారు. ఎప్పుడో తీసే ఈ ఉద్యోగాల కోసం ముందస్తు ప్రణాళికగా సిద్ధమయ్యే వారు లెక్కకు మించే ఉంటారు. అయితే ఇలాంటి వారికి ఇండియన్ నేవీ గుడ్ న్యూస్ ప్రకటించింది. ఇండియన్ నేవీలో క్యాడెట్ స్కీమ్ ద్వారా పలు పోస్టులు భర్తీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకు సంభందించిన నోటిఫికేషన్ పూర్తి వివరాలు తెలుసుకుందాం..

home_banner_3

మొత్తం పోస్టుల సంఖ్య : 34

ఎడ్యుకేషన్ బ్రాంచ్  : 5

ఎగ్జిక్యూటివ్ అండ్ టెక్నికల్ బ్రాంచ్ : 29

అర్హతలు : 10 + 2 పరీక్ష పాస్ అయినవారు ఎవరైనా సరే ఈ ఉద్యోగాలకి అర్హులే. అయితే ఫిజిక్స్, మాథ్స్ , కెమిస్ట్రీలో 70 శాతం మార్కులతో పాస్ అయ్యి ఉండాలి. ఇంగ్లీష్ లో 50 శాతం మార్కులు వచ్చి ఉండాలి.

home_banner_4

వయస్సు : 2001 జులై నుండీ 2004 జనవరి మధ్య జన్మించిన వారై ఉండాలి.

దరఖాస్తు ప్రారంభ తేదీ : అక్టోబర్ -6 -2020

దరఖాస్తు చివరితేదీ : అక్టోబర్ 20 -2020

 

మరిన్ని వివరాలకోసం

https://www.joinindiannavy.gov.in/

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *