నాగార్జున‌కు వైసీపీ ఎంపీ సీటు ఆఫ‌ర్‌..!

ఏపీలో రాజకీయం రోజుకో రకంగా రంగు మార్చుకుంటోంది. వ‌చ్చే ఎన్నిక‌ల‌కు మ‌రో 20 నెల‌ల టైం ఉండ‌గానే అప్పుడే క‌ప్ప‌దాట్లు, సెల‌బ్రిటీల పొలిటిక‌ల్ ఎంట్రీలు, సీట్ల కోసం పాట్లు స్టార్ట్ అయ్యాయి. ఈ క్ర‌మంలోనే టాలీవుడ్ మ‌న్మ‌థుడు, కింగ్ నాగార్జున వైసీపీలో చేరుతున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. ఆయ‌న పొలిటిక‌ల్ ఎంట్రీపై త నాలుగైదు నెల‌లుగా వార్తలు వ‌స్తూనే ఉన్నాయి.
 ఇక కొద్ది నెల‌ల్లోనే నాగ్ వైసీపీలో చేర‌నున్న‌ట్టు ఇప్పుడు లేటెస్ట్ వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది. నాగ్ కుటుంబానికి, వైఎస్‌.ఫ్యామిలీకి వైఎస్‌.రాజ‌శేఖ‌ర్‌రెడ్డి సీఎంగా ఉన్న‌ప్ప‌టి నుంచే స‌న్నిహిత సంబంధాలు ఉన్నాయి. నాగ్ వ్యాపారం, ఇత‌ర‌త్రా క‌ట్ట‌డాల క్ర‌మ‌బ‌ద్ధీక‌ర‌ణ విష‌యంలో వైఎస్ సాయం చేస్తే, నాగ్ 2009 ఎన్నిక‌ల్లో వైఎస్ చేప‌ట్టిన ప్ర‌భుత్వ ప‌థ‌కాలు ఉచిత ప్ర‌చారం చేశాడు.
ఇక ఆ త‌ర్వాత నాగార్జున‌కు, జ‌గ‌న్‌కు ఇద్ద‌రికి కామ‌న్ ఫ్రెండ్స్‌తో వ్యాపార లావాదేవీలు ఉన్నాయి. ఇక వైసీపీలో చేరే నాగార్జున‌కు జ‌గ‌న్ రాజ‌ధాని కేంద్రాలు అయిన విజ‌య‌వాడ లేదా గుంటూరు లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గాల్లో ఏదో ఒక సీటు ఆఫ‌ర్ చేస్తార‌ని తెలుస్తోంది. ఈ రెండు సీట్ల ఎంపిక‌లో బెస్ట్ ఆప్ష‌న్ నాగ్‌దే అని కూడా స‌మాచారం.నాగార్జున కూడా ఇక్క‌డ నుంచి ఎంపీగా పోటీ చేసి ఏపీ రాజ‌ధాని ప్రాంతంలో త‌న వ్యాపార సామ్రాజ్యాన్ని విస్త‌రించుకునేందుకు పావులు క‌దుపుతున్న‌ట్టు తెలుస్తోంది. ఏదేమైనా నాగ్ తెలంగాణ‌లో టీఆర్ఎస్‌కు, ఏపీలో వైసీపీకి బాగా క్లోజ్ అవుతున్నట్టే క‌నిపిస్తోంది.
Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *