జగన్ పై మరో భారీ కుట్ర..??

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పై జరిగిన కత్తి దాడి ఎంతటి తీవ్ర పరిణామాలకు దారితీసింది ప్రస్తుత పరిస్థితి చూస్తే అర్థమవుతుంది. ఈ దాడి నుంచి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. అయితే అతి త్వరలో జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్రను కొనసాగించనున్నారని తెలుస్తోంది. అయితే ఈ దాడి జరిగిన తరువాత ప్రారంభం కాబోయే ప్రజా సంకల్ప యాత్ర కు మరింత ప్రజాదరణ వెల్లువలా రావడం ఖాయమని అంటున్నారు విశ్లేషకులు. నవంబర్ 3 న జగన్ తన పాదయాత్రను పునఃప్రారంభించాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది… అయితే

Image result for jagan padayatra

వైద్యులు చెప్పినా  తాను మాత్రం యాత్రకు ఆటంకం కలిగించకుండా వెళ్లవలసిందే అని శ్రేణులకు కూడా జగన్ యాత్రకు ఏర్పాట్లు చేయమని చెప్పారట… అయితే మొన్న జరిగిన దాడి ఘటనను దృష్టిలో పెట్టుకుని ఏర్పాట్లు చేయనున్నట్లు ప్రోగ్రామ్స్ కమిటీ కోఆర్డినేటర్ తలశిల రఘురాం తెలిపారు. ఇదిలా ఉంటే…తనపై దాడి జరిగిన తర్వాత జగన్ ప్రారంభించబోయే యాత్ర కావడంతో జగన్ ని పరామర్శించడానికి ఎంతోమంది జగన్ కోసం వస్తారని..అయితే

Image result for jagan padayatra

అయితే భారీ స్థాయిలో  ప్రజలు జగన్ను చూసేందుకు వచ్చే అవకాశం ఉండటంతో ఈ అవకాశాన్ని టిడిపి ప్రభుత్వం తనకు అనుకూలంగా మార్చుకోవాలని ప్రయత్నిస్తోందట. అందులో భాగంగానే జగన్ కి మూడంచెల కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేయమని పోలీసులకు ఆదేశాలు జారీ చేసినట్లుగా టాక్ వినిపిస్తోంది. జగన్ వద్దకు ఎవరికి వెళ్లే అవకాశం లేకుండా భద్రత ఏర్పాట్లు చేస్తున్నారని, ఈ ఏర్పాట్లు కారణంగా ప్రజలను జగన్ దగ్గరకి రాకుండా దూరం చేసే కుట్ర అవకాశం ఉందని అంటున్నారు విశ్లేషకులు.. తద్వారా పాదయాత్రకు జనాదరణ తగ్గించే ప్రయత్నం చేస్తూ జనాలను జగన్ కి దూరం చేయాలనే కుట్రను రచించారని ఆరోపిస్తున్నారు వైసీపీ నేతలు..

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *