జగన్ పాదయాత్రలో..సంచలన నిర్ణయాలు…ఇవే

వైఎస్ రాజశేఖర్ రెడ్డి 2004 లో అధికారంలోకి రావడానికి చేసిన పాదయాత్ర అందరికీ గుర్తు ఉండే ఉంటుంది.ఆ పాదయాత్రే  రాజశేఖర్ రెడ్డి ని సీయం కుర్చీలో కూర్చునేలా   చేసింది. రైతుల ,సామాన్య ప్రజల కష్టాలని స్వయంగా చూసిన  రాజశేఖర్ రెడ్డి ఎన్నికల్లో విజయం అనంతరం రైతులకోసం కష్టాలు తీర్చేలా,ఆర్ధికంగా కుదేలు అవ్వకుండా చేసిన ఒక్క ఋణ మాఫీ సంతకం ఎంతో మంది పేద రైతులు,ప్రజలలో చెరగని ముద్ర వేసాయి.

rajashaker reddy first signature కోసం చిత్ర ఫలితం

ఇప్పుడు మరలా రాజశేఖర్ రెడ్డి గారి తనయుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  తండ్రి బాటలో నడవాడానికి సిద్దంఅయ్యారు. ఎన్నికల  ముందు నుండే ప్రజల్లోకి వెళ్లి వారు పడుతున్న భాదలు తెలుసుకోవడానికి పాదయాత్రకి పూనుకున్నారు. దీనికి సంబంధించిన తేదీలు ఖరారయ్యాయి. అక్టోబర్ 27 నుంచి ఆరునెలలపాటు ఈ యాత్ర కొనసాగనుంది. ఈ పాదయాత్రలో జగన్ ప్రకటించిన నవరత్నాల(వ్యవసాయం, అమ్మఒడి, ఆరోగ్యశ్రీ, బెల్టుషాపుల నిర్మూలన, మహిళా సంఘాల రుణాలమాపీ, యువతకు భవిత, జలయజ్ఞం, పక్కాఇళ్లు, పింఛన్లు) కి విస్తృతమైన ప్రచారాన్ని కల్పించనున్నారు.

 Related image

అయితే తన తండ్రి రాజశేఖర్ రెడ్డి లా ప్రజలలో తమ పార్టీ మీద మరింత నమ్మకం కలిగేలా సంతకాల హామీని కూడా ఇవ్వనున్నట్టు సమాచారం. ఈ విషయంలో ఎలా ముందుకు వెళ్ళాలి అనే ఆలోచనలు చేస్తున్నారట. పాద యాత్రని చేస్తూ మధ్య మధ్యలో బహిరంగ వేదికలని ఏర్పాటు చేస్తూ. ఒక్కో వేదిక మీద ఒక్కో హామీ సంతకం గురించి ప్రస్తావిస్తారని తెలుస్తోంది. ఇదే కనుక జరిగితే  2004 సీన్ మళ్లి  రిపీట్ అయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు చెప్తున్నారు.

 

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *