అభిమానులకి పండుగ గిఫ్ట్ ఇచ్చిన -తారక్ (కుశ ఫస్ట్ లుక్)

వినాయక చవితిని పురస్కరించుకుని నందమూరి నట వారసుడు, జూనియర్.ఎన్టీఆర్ తన అభినానులకి బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చాడు.టెంపర్,నాన్నకు ప్రేమతో,జనతా గ్యారేజ్ ఇలా వరుస విజయాలతో నందమూరి భిమానులని అలరించిన జూనియర్. ప్రస్తుతం బాబీ డైరెక్షన్‌లో ‘జై లవ కుశ’ చేస్తున్నాడు.  తన కెరీర్‌లో మొదటిసారిగా  త్రిపాత్రాభినయం చేస్తున్నాడు. ఈ మూడు పాత్రలకు సంబంధించిన ఫస్ట్‌ లుక్, టీజర్లను విడివిడిగా విడుదల చేస్తామని ప్రకతనచేసింది .అందులో భాగంగానే ‘జై’, ‘లవ’ ఫస్ట్ లుక్, టీజర్లను విడుదల చేశారు. ఈ రెండు టీజర్లకు రికార్డు వ్యూస్ కూడా వచ్చాయి.

Jai Lava Kusa new poster: Except for the long hair, Jr NTR as Kusa offers nothing new

జై ,లవ ,   క్యారక్టర్లు టీజర్స్ లో చుసిన అభిమానులు ఎప్పుడెప్పుడు “కుశ “ ని చూస్తామా అని అనుకుంటున్న తరుణంలో తన అభిమానులకోసం కొద్దిసేపటి క్రితమే “కుశ” ఫస్ట్ లుక్ ని తన ట్విట్టర్ లో చవితి శుభాకాంక్షలు చెప్తూ, కొద్దిసేపట్లో మీకో స్మాల్ సర్‌ప్రైజ్ అంటూ పోస్ట్ చేసి, అభిమానులు బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చాడు. పండగ రోజు తమ అభిమాన హీరో ఇచ్చిన పెద్ద గిఫ్ట్ కు ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు.

 

 

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *