జై లవకుశ..రివ్యూ

సినిమా : జై లవ కుశ

నటీనటులు : యంగ్‌టైగర్ ఎన్టీఆర్, రాశీఖన్నా, నివేదా థామస్‌, సాయికుమార్, రోనిత్ రాయ్, హంసా నందిని, నందితా, తదితరులు

నిర్మాత : కళ్యాణ్ రామ్
బ్యానర్ : ఎన్టీఆర్ ఆర్ట్స్

దర్శకుడు : కేఎస్ రవీంద్ర (బాబీ)

ఛాయాగ్రహణం : ఛోటా కే నాయుడు
సంగీతం : దేవిశ్రీప్రసాద్

ఎడిటర్ : కోటగిరి వెంకటేశ్వరరావు

రిలీజ్ డేట్ : 21-09-2017

బాబీ తనేమో వరుస ఫ్లాప్ లతో ఉన్నాడు..ఎన్టీఆర్ వరుస హిట్స్ తో హ్యాట్రిక్ కొట్టి ఉన్నాడు..నెక్స్ట్ సినిమాకి బాబిని తీసుకుని ఎన్టీఆర్ ఒక సాహసం చేశాడు అనుకున్నారు అంతా..సినిమా మీద ఒక్కో రోజు ఒక్కోలా వచ్చే న్యూస్ సగటు ప్రేక్షకుడిని సినిమా కోసం వెయిట్ చేయించేలా చేసింది. ఇందులో తారక్ త్రిపాత్రాభినయం చేస్తున్నాడు అని తెలియగానే ఎంతో సంబరపడ్డారు ఫ్యాన్స్. ఒకసారి టీజర్..మరొకసారి పాటలని ఒక్కొకటిగా రిలీజ్ చేయడం అంతా పక్కా స్కెచ్ తో సాగింది ఈ సినిమా ప్రమోషన్స్. ట్రైలర్ రిలీజ్ అవ్వగానే ఒక్కసారిగా అంచనాలు భారీగా మారిపోయాయి.ఇన్ని అంచనాల మధ్య వచ్చిన జూనియర్.ఎన్టీఆర్ సినిమా ప్రేక్షకుల అంచనాలని అందుకుందా ? ఎలా ఉందొ తెలుసుకుందాం..

జై లవకుశ కోసం చిత్ర ఫలితం

కధ
చిన్నతనంలోనే తల్లితండ్రులని పోగొట్టుకున్న జై లవ కుశ తన మేన మామ దగ్గర పెరుగుతారు.ఒకరోజు ఫైర్ ఆక్సిడెంట్ అయ్యి ఆప్రమాదం నుంచి ముగ్గురు తప్పించుకుంటారు..కానీ ఎవరికీ వారు మిగతా ఇద్దరు చనిపోయారు అని అనుకుంటారు. కట్ చేస్తే…

చిన్నోడైన లవ బ్యాంక్ మేనేజర్ అవుతాడు. అతడు చాలా అమాయకుడు, భయస్తుడు కావడంతో బ్యాంకులో అందరూ అతడ్ని ఆట పట్టిస్తుంటారు. మరోవైపు ‘కుశ’ కంత్రిగా ఎదుగుతాడు. ఎలాగైనా యూఎస్ఏ వెళ్లి అక్కడ సెటిల్ అవ్వాలన్నదే లక్ష్యం. అందుకు రూ.25 లక్షలు కావాలి…కుశ తన కంత్రి బ్రెయిన్‌తో మోసం చేసి అంత మొత్తాన్ని సమకూరుస్తాడు. సరిగ్గా అదే టైంలో ఇండియాలో నోట్స్ బ్యాన్ అవుతాయి. దాంతో.. తన ప్లాన్ బెడిసికొట్టిందన్న బాధతో కుశ పీకల్లోతు తాగి రోడ్డు మీద వస్తుంటే.. అతనికి యాక్సిడెంట్ అవుతుంది. అది చేసేది మరెవ్వరో కాదు లవనే.

జై లవకుశ కోసం చిత్ర ఫలితం

ఆ యాక్సిడెంట్‌తో చిన్నప్పుడు విడిపోయిన లవ, కుశలు కలుస్తారు. అలా కలిసిన వాళ్లు తమతమ బాధలు పంచుకుంటారు. లవ తనకు బ్యాంకులో జరుగుతున్న అవమానం గురించి చెప్పుకుంటాడు. అప్పుడు కుశకి ఓ ప్లాన్ తడుతుంది. తాను లవ ప్లేస్‌లోకి వెళ్లి, 25 లక్షలు కొట్టేయాలనే ఉద్దేశంతో.. లవనే ట్రాప్ చేస్తాడు. ‘నీ ప్లేస్‌లో బ్యాంకుకి వెళ్లి అందరికి బుద్ధి చెప్తాను’ అని కుశ అనడంతో.. అందుకు లవ ఒప్పుకుంటాడు. సీన్ కట్ చేస్తే … జోధ్‌పూర్‌లో వుంటున్న ‘జై’ రావణుడిలా వుంటాడు.

పాలిటిక్స్ లోకి వెళ్ళాలని అనుకుంటాడు అయితే.. అతనికున్ననత్తి వల్ల పొలిటికల్ స్పీచెస్ ఇవ్వలేకపోతుంటాడు. ఓసారి తన గ్రూప్‌లో ఒక వ్యక్తి చనిపోగా…అతని ఇంటికి వెళ్తాడు జై. అక్కడ నివేతాను చూసి లవ్‌లో పడతాడు. ఇక్కడ ఇతని లవ్ ట్రాక్ సాగుతుంటే.. అక్కడ బ్యాంకులో 25 లక్షలు పోతాయి. ఆ డబ్బులు కొట్టేసింది లవనే అని బ్యాంకువాళ్లు అనుకుంటుండగా.. తన ప్లేస్‌లో వెళ్ళొచ్చిన కుశ ఆ మనీ తీసి వుండొచ్చని లవ అనుకుంటాడు. ఈ విషయమై ఇద్దరి మధ్య చర్చ జరుగుతుండగా.. ఎవరో వ్యక్తులు వచ్చి వారిని కిడ్నాప్ చేస్తారు. వాళ్లెవరు? అసలు వీరి చిన్నప్పుడు ఆ ఫైర్ యాక్సిడెంట్ ఎలా జరిగింది? దానివెనుక ఎవరిదైనా హస్తం వుందా? కుశ ఎందుకు యూఎస్ఏ వెళ్లాలనుకుంటాడు? బ్యాంక్‌లో ఆ డబ్బులు కొట్టేసింది కుశనేనా లేక మరెవరైనా చేశారా? పాలిటిక్స్‌లో రాణించాలన్న జై కల నెరవేరుతుందా? చివరికి జై, లవ, కుశలు మళ్ళీ కలుసుకుంటారా? లేదా? అన్న అంశాలతో ఈ మూవీ సాగుతుంది.

జై లవకుశ కోసం చిత్ర ఫలితం

విశ్లేషణ:

కధ విషయానికి వస్తే చాలా కొత్తగా ఉంది..ముగ్గురు సోదరుల మధ్య నడిచే ఈ సినిమా ట్విస్ట్ లతో ఆధ్యాంతం ఆకట్టుకుంది. ఫస్ట్ హాఫ్ లో లవ కుశ లతో నడిపించాడు..తరువాత సెకండ్ హాఫ్ లో “జై” క్యారెక్టర్ తో రక్తికట్టించాడు..ఎంతో థ్రిల్లింగ్ గా..యాక్షన్ ,కామెడి తో ఎంతో అధ్బుతంగా తెరకెక్కించాడు బాబి..ఈ సినిమాతో బాబి రేంజ్ పెరిగిపోవడం ఖాయం..అందరి దర్సకుల్లా ఎదో చేసేద్దాం సెంటిమెంట్ అవసరం లేని చోట పెట్టి ప్రేక్షకుల నుంచి మార్కులు కొట్టేద్దాం అని అనుకోలేదు బాబి.. ఏ స్టోరీ రాసుకున్నాడో, దాన్ని సరిగ్గా ఎగ్జిక్యూట్ చేసి, ఆడియెన్స్ హృదయాల్ని గెల్చుకున్నాడు. ఎక్కడైనా తప్పులు దొరుకుతాయా? అని చూస్తే.. ఆ అవకాశం లేకుండా చేశాడు. దీన్ని బట్టి.. దర్శకుడిగా అతని ప్రతిభేంటో అర్థం చేసుకోవచ్చు.

ఇక సినిమా పరంగా చూస్తే.. ఫస్టాఫ్ నుంచి చివరివరకు సినిమా ఆసక్తి రేపుతూ ఇంట్రెస్టింగ్‌గా సాగుతుంది. అసలు స్టార్ట్ అయిన మొదట్లోనే కథలో లీనమైపోతాం..ఇది బాబీ మేజిక్ అని చెప్పాలి. దీన్ని బట్టి.. దర్శకుడిగా అతని ప్రతిభేంటో అర్థం చేసుకోవచ్చు.

జై లవకుశ కోసం చిత్ర ఫలితం

ఇక కథలోకి ఎంటరయ్యాక ఎక్కడా ట్రాక్ తప్పకుండా, సినిమా నడిచేకొద్దీ ఇంట్రెస్ట్ పెంచుతూ ముందుకు తీసుకెళ్లాడు. ప్రీ-ఇంటర్వెల్ వరకు ఎంటర్టైన్ చేసి, ఇంటర్వెల్ వద్ద బ్రహ్మాండమైన బ్యాంగ్‌తో మైండ్ బ్లాక్ చేశాడు. అదే ఊపుతో సెకండాఫ్‌ని మరింత ఆసక్తిగా నడిపించాడు. ఒకదానితర్వాత ఒక ట్విస్టును రివీల్ చేసుకుంటూపోతూ బాగానే థ్రిల్ చేశాడు. ఇక క్లైమాక్స్ ఎపిసోడ్ అయితే అదిరిపోయింది. ఆ ట్రాక్‌లో తారక్ నటన అందరినీ కట్టిపడేస్తుంది. ఈ ఎపిసోడ్‌లో సాయికుమార్ పాత్ర కూడా పెద్ద ట్విస్ట్. అసలు సినిమాలోనే క్లైమాక్స్ ది బెస్ట్ ఎపిసోడ్. దీన్ని బాబీ సూపర్బ్‌గా మలిచాడు. ఓవరాల్‌గా చెప్పుకుంటే.. ఇది సూపర్‌హిట్ డూపర్ బిగ్గెస్ట్ హిట్ సినిమా.

 

నటీనటుల ప్రతిభ :
ఎన్టీఆర్ ప్రతిభ మనం చెప్పుకోవడం కంటే..అతని పరిణితి గురించి మాట్లాడుకోవం బెస్ట్..నందమూరి నటసింహం..ప్రతీ పాత్రలో జీవించాడు..ప్రతీ పాత్రలో మనకి తారక్ మాత్రం ఎక్కడా కనపడడు. అంతలా ఎన్టీఆర్ ఆ మూడు పాత్రల్లో జీవించేశాడు.

ఇక రాశీఖన్నా, నివేదా థామస్‌లు అందంగా కనిపించడంతోపాటు అభినయంతోనూ ఆకట్టుకున్నారు. ఫస్టాఫ్‌లో రాశీ, సెకండాఫ్‌లో నివేదా తమ మార్క్ యాక్టింగ్‌తో ప్రత్యేకత చాటుకున్నారు. రోనిత్ రాయ్ విలనిజాన్ని బాగా పండించాడు. సాయికుమార్ తన మార్క్ నటనతో ఆకట్టుకున్నారు. మిగతా నటీనటులు తమతమ పాత్రల పరిధి బాగానే నటించారని చెప్తున్నారు.

 

సాంకేతిక

సినిమాటోగ్రఫీతో ఈ చిత్రాన్ని మరో లెవెల్‌కి తీసుకెళ్లాడు చోటా కే నాయుడు . కొన్ని సందర్భాల్లో అతని కెమెరా వర్క్‌కి ఆశ్చర్యపోతాం. ప్రతి సన్నివేశాన్ని చాలా గ్రాండ్‌గా చూపించిన ఛోటా.. హీరో ఎలివేషన్ సీన్ల దగ్గర అదుర్స్ అనిపించాడు.

దేవిశ్రీప్రసాద్ అందించిన పాటలు ఆల్రెడీ హిట్ అయ్యాయి. ఇక బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అయితే మూడ్‌కి తగ్గట్టు చితక్కొట్టేశాడు. ఎడిటర్, ఆర్ట్ వర్స్ బాగానే కుదిరాయి. కళ్యాణ్ రామ్ నిర్మాణ విలువలకు వంక పెట్టడానికి లేదు. తమ్ముడితో తొలిసారి సినిమా చేసినందుకు ఏమాత్రం వెనకాడకుండా భారీ ఖర్చు చేశాడు. ఇక దర్శకుడు బాబీ గురించి మాట్లాడుకుంటే.. తాను రాసుకున్న స్టోరీని వెండితెరపై అద్భుతంగా మలచడంలో సక్సెస్ అయ్యాడు.

రేటింగ్ – ౩.5 /5

 

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *