లవకుమార్ గా ఎన్టీఆర్…అదరగొట్టాడు( టీజర్ )

జూనియర్ ఎన్టీఆర్ తన అభిమానులకి వినాయకచవితి కానుకగా జై లవకుశ టీజర్ ని రిలీజ్ చేశాడు. ఈ టీజర్ లో కనిపించే ఎన్టీఆర్ చాలా క్లాస్ లుక్ తో,ఒక బ్యాంక్ ఉద్యోగిగా లవ్ కుమార్ అనే పాత్రలో పరిచయం అవుతాడు. ఈ గెటప్ లో ఎన్టీఆర్ సూపర్ గా ఉన్నాడు. తనను ప్రసన్నం చేసుకోవడానికి దగ్గరకి వచ్చిన అసిస్టెంట్ మేనేజర్ బ్రహ్మాజీని సున్నితంగా చెప్పి పంపించే సీన్ అభిమానులతో ఈలలు వేయిస్తుంది. ఈ పాత్ర స్వభావం ఏంటి అనేది స్పష్టంగా చూపించాడు దర్శకుడు బాబీ. మంచితనం తప్ప ఇంకేమి తెలియని లవ కుమార్ ఒక యాక్సిడెంట్ వల్ల తన జీవితాన్నే మార్చుకోవాల్సి వస్తుంది. అక్కడ కూడా తన మంచితనాన్ని చూపబోయి పెద్ద ప్రమాదంలో ఇరుక్కుంటాడు . మరి అది ఎవరు చేసారు, ఆ ప్రమాదానికి జై కి ఏమైనా లింక్ ఉందా, ఇంకా మనకు కనిపించని కుశ ఎవరు అనేది ఇంకొద్ది రోజులు ఆగితే కాని క్లారిటీ రాదు.

ఇంతకు ముందు చూసిన జై టీజర్ లో పాత్ర స్వభావానికి పూర్తిగా విరుద్ధంగా ఉన్న లవ పాత్ర యూత్ కి అందులోని లేడీ ఫాన్స్ కి పిచ్చ పిచ్చగా కనెక్ట్ అయ్యేలా ఉంది. ట్రైలర్ దాకా ఆగాల్సిందే. దేవి శ్రీ ప్రసాద్ మరోసారి బ్యాక్ గ్రౌండ్ తో పాటలతో తనదైన శైలిలో రెచ్చిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. టీజర్లే ఇలా ఉంటే ఇక ట్రైలర్ ఇంకెలా ఉంటుందో. సెప్టెంబర్ 21 జై లవకుశ రావడంలో ఎటువంటి అనుమానం అక్కర్లేదు. వచ్చే నెల 3న ఆడియో కూడా గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు.ఇలోగా అభిమానులు కుశ లుక్ కోసం వెయిట్ చేయాల్సిందే. మొత్తానికి జూనియర్ ఎన్టీఆర్ “జై లవకుశ” అభిమానులని అలరిస్తుంది అనడంలో సందేహం లేదు

 

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *