కళ్యాణ్ రామ్ క్రేజీ ప్రాజెక్ట్ “అమిగోస్”…ఈ టైటిల్ వెనుక ఉన్న సీక్రెట్ ఏంటో తెలుసా…!!

సినిమా ఇండస్ట్రీ లో ఎంత టాలెంట్, వెనుకాల ఎంత సపోర్ట్ ఉన్నా సరే ఒక్కోసారి అదృష్టం  ఆలస్యంగా కలిసి వస్తుంది. అయినా సరే పట్టుదలతో తమ టాలెంట్ ను నమ్ముకుని కష్టపడి పనిచేసే వాళ్లకు తప్పకుండా విజయం వరిస్తుంది. తమలోని లోటు పాట్లు సరిచేసుకుంటూ, ఎప్పటికప్పుడు తమని తాము మెరుగు పరుచుకుంటూ కళను నమ్ముకుని పైకి వచ్చిన హీరోలు, ఆర్టిస్ట్ లు ఎందరో ఉన్నారు. అలాంటి వారిలో ఒకరు నందమూరి కళ్యాణ్ రామ్.

Amigos: Kalyan Ram Nandamuri Announced The Title Of His Next…

కళ్యాణ్ రామ్ చేసిన సినిమాలు తక్కువే అయిన అభిమానులను మాత్రం బాగానే సంపాదించుకున్నారు. వైవిధ్య భరితమైన సినిమాలు చేస్తూ, కొన్ని సార్లు ప్లాప్ లు ఎదురైనా  అధైర్య పడకుండా ముందుకు దూసుకుపోతున్నారు. ఈ మధ్య కాలంలో విడుదలైన బింబిసార సినిమా కళ్యాణ్ రామ్ కి మంచి క్రేజ్ తీసుకువచ్చింది. ఈ సినిమా టైటిల్ తోనే ఆసక్తిని రేకెత్తించి బిగ్ హిట్ కొట్టారు. ప్రస్తుతం తన నెక్స్ట్ సినిమా టైటిల్ ను ప్రకటించి మరో సారి అందరిలో ఆసక్తిని రేకెత్తించారు. ఇండస్ట్రీ వర్గాలు కూడా ఈ సినిమా టైటిల్ పై ఆశ్చర్యం వ్యక్తం చేశాయట.

Amigos: మూడు పాత్రల్లో కల్యాణ్ రామ్.. సెన్సేషనల్‌గా అమిగోస్ ఫస్ట్ లుక్ | Kalyan  Ram Amigos Movie First Look and Release Date - Telugu Filmibeat

కళ్యాణ్ రామ్ క్రేజీ ప్రాజెక్ట్ పేరు ఏంటంటే  “అమిగోస్”.  వినటానికి  టైటిల్ బాగుంది, ఆసక్తిగా ఉంది, ఇంతకీ ఈ పేరుకు అర్ధం ఏంటంటే. ఇదొక  స్పానిష్ పదమని, ఒక శ్రేయోభాలషిని సూచించటానికి లేదా ఒక రిఫర్  చేయటానికి ఉపయోగించే పదంగా తెలుస్తోంది. ఈ సినిమా టైటిల్ కి తగ్గట్టుగానే హీరో పాత్ర ఉంటుందట. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ 3  పాత్రలలో కనిపించబోతున్నారట.  విడుదల చేసిన టైటిల్ పోస్టర్ లో రాసిన కాప్షన్ ఈ విధంగా ఉంది, “they say when you meet somebody that looks just like you, you die”. ఈ కాప్షన్ నందమూరి అభిమానుల్లోనే కాదు మొత్తం సిని అభిమానుల్లోనే ఆశక్తిని రేపుతోంది. చూస్తోంటే, కళ్యాణ్ ఈసారి కొత్త టైటిల్ తోనే కాదు, అంతకుమించి వైవిధ్య బరితమైన కధతోను ఇంకో బ్లాక్ బాస్టర్ తన ఖాతాలో వేసుకోవడం పక్కా అంటున్నారు అభిమానులు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *