బ్లూ ఫిల్మ్‌లు చూశారా ? సీఎం ప్రశ్న
ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి నుంచి ఓ బహిరంగ సభలో బ్లూ ఫిలిం అన్న మాట వస్తుందని ఎవ్వరూ ఊహించలేరు. అయితే కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాత్రం ఓ బహిరంగ సభలో అందరిని ఉద్దేశించి ఏకంగా మీలో ఎంతమంది బ్లూఫిలిం చూస్తారని ప్రశ్నించడంతో అందరూ అవాక్కయ్యారు. మరి సిద్ధరామయ్య అలా ఎందుకు ప్రశ్నించారో ? ఆ సంగతేంటో చూద్దాం.
ఇటీవల అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సభలో బ్లూఫిలిం చూస్తూ దొరికిపోయిన బీజేపీ ఎమ్మెల్యే తీరును తప్పు పడుతూ బెల్గావీలో ఏర్పాటు చేసిన సభలో ప్రస్తావించారు. ఈ సందర్భంగా సదరు ఎమ్మెల్యే తీరును తీవ్రంగా తప్పు పట్టారు. దేవాలయం లాంటి అసెంబ్లీలో ఆ పాడు చిత్రాలు చూస్తారా? అంటూ మండిపడ్డారు.
ఇక ప్రజలను ఉద్దేశించి సీఎం మాట్లాడుతూ.. మీలో ఎంతమంది బ్లూఫిలిం గురించి తెలుసు? అని ప్రశ్నించటమే కాదు.. మీలో ఎవరైనా అలాంటివి చూశారా? ప్రశ్నించారు. తన ప్రశ్నకు సమాధానం గురించి వెయిట్ చేయకుండానే.. సిగ్గులేని పనులు చేసే వారు ప్రజాజీవితం నుంచి వైదొలగాలన్నారు.