ఊహించని ఘటన:  హీరో విజయ్ సేతుపతిపై ఎయిర్ పోర్ట్ లో దాడి…

తమిళ హీరో విజయ్ సేతుపతి పై ఊహించని రీతిలో జరిగిన  దాడి ఘటన కలకలం సృష్టించింది.బెంగుళూరు నుంచీ ఎయిర్ పోర్ట్ నుంచీ బయటకు వస్తున్న సమయంలో వెనుక నుంచీ ఓ వ్యక్తి వేగంగా పరిగెడుతూ వచ్చి సేతిపతిని కాలుతో తన్నాడు. ఈ ఘటన జరిగిన వెంటనే సేతుపతి తో సహా అందరూ షాక్ కు గురయ్యారు.

Man attacks Vijay Sethupathi and team at Bengaluru airport, no case  registered | The News Minute

అదే సమయంలో వారికి దగ్గరలో ఉన్న ఓ వ్యక్తి గొడవ జరుగుతుండగా వీడియో తీయడంతో ఈ వ్యవహారం బయటకు వచ్చింది. ఇదిలాఉంటే ఎయిర్ పోర్ట్ లో విజయ సేతుపతి అసిస్టెంట్ కు అలాగే తాగి ఉన్న ఓ ప్రయాణీకుడికి మధ్య గొడవ జరిగిందని ఈ కారణంతోనే  అతడుసేతుపతి వెళ్తున్న సమయంలో వెనుకాల నుంచీ తన్నాడని, వెంటనే విజయసేతు అనుచరులు అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారని తెలుస్తోంది. ఈ పరిణామాల తరువాత తన తప్పు ఒప్పుకుంటూ క్షమించమని అతడు అడగడంతో గొడవ సర్దుమణిగిందని తెలుస్తోంది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *