“ఉపాసన ట్వీట్” కి..షాకింగ్ రెప్లై ఇచ్చిన “కేటిఆర్”…!!!

టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తనయుడు కేటిఆర్ సోషల్ మీడియాలో  యాక్టివ్ గా ఉండే పొలిటికల్ లీడర్స్ లో ఒకరు..ఈ విషయం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు..ఎప్పటికప్పుడు నెటిజన్లు అడిగే ప్రశ్నలకి తరువుగా స్పదించడంలో కేటిఆర్ ముందుంటారు. తన కార్యాలయంలో మాత్రమే కాకుండా సోషల్ మీడియా లో వచ్చే వినతులకి సైతం స్పందిస్తూ ఉంటారు…అంతేకాదు కేటిఆర్ కి ట్విట్టర్ లో ఫాలోయింగ్ కూడా ఎక్కువే..అయితే

Image result for ktr images

మెగాస్టార్ కోడలు అయిన రామ్ చరణ్ సతీమణి ఉపాసన కేటిఆర్ కి ట్విట్టర్ ద్వారా సాయం అందించాలని కోరారు..అంధ బాలికల హాస్టల్‌కు వార్డెన్‌గా పని చేస్తున్న శైలజా రాణి వీడియోను ఉపాసన ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. స్కూల్ కోసం గవర్నమెంట్ బిల్డింగ్ సాంక్షన్ చేసింది. దీనిపై చాలా సంతోషంగా ఉన్నాం..స్కూల్ కోసం సాయం అందించిన ప్రభుత్వం అదేవిధంగా బాలికల కోసం హాస్టల్ కి కూడా అనుమతులు ఇవ్వాలని ఆ వీడియోలో రిక్వెస్ట్ చేశారు.

Image result for upasana kamineni orphan child

అయితే ఆ వీడియో ని చూసిన ఉపాసన తెలంగాణా ప్రభుత్వం ఈ భాద్యత కూడా తీసుకుంటే బాలికలకి సాయం చేసినవారవుతారు అంటూ ప్రభుత్వానికి ట్విట్టర్ ద్వారా విన్నవించారు..దాంతో ఉపాసన ట్వీట్ కి స్పందిచిన కేటిఆర్. మీరు డిసెంబర్ 11న కొత్త గవర్నమెంట్ ఏర్పడే వరకు ఆగాలి అని కోరారు..ఇదిలాఉంటే ఉపాసన ఆ బాలికల కి దీపావళి కానులకలు ఇస్తూ ఆ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు..ఉపాసన ట్వీట్ కి కేటిఆర్ వెంటనే రిప్లై ఇస్తూ హామీ ఇవ్వడం నేటిజన్లని షాక్ కి గురిచేసింది.

 

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *