మీ భార్య శుక్రవారం ఇలా చేస్తే చాలు..వద్దంటే డబ్బు వస్తుందట

డబ్బు ఇప్పుడు సర్వ రోగ నివారిణి ఇది ఎవరికీ చేదు కాదు. ప్రస్తుతం మనకి ఉన్న పరిస్థితులకి    డబ్బు సంపాదించి త్వరగా ధనవంతులు కావాల్సిన అనివార్యత అందరిలోనూ బయలుదేరింది. ఇక సంపాదన కోసం కష్టాన్ని, తెలివితేటలను వినియోగించాల్సి ఉంటుంది దీనితో పాటు అదృష్టం కుడా చాలా ముఖ్యం . ఇంట్లో కి లక్ష్మీదేవి రావాలంటే ఎన్నో నిష్టా గరిష్ఠ నియమాలు ఆచరించాలని ఇంట్లో ఆడవాళ్లు విశ్వసిస్తారు. అయితే మానసిక పవిత్రతతో కొన్ని సులువైన నియమాలు ఆచరించినా లక్ష్మీదేవి ఆ ఇంట కొలువై ఉంటుందని ఆధ్యాత్మిక ప్రవచనకారులు చెబుతున్నారు. ధనానికి అది దేవత లక్ష్మిదేవి. ధనవంతులు కావాలంటే ఎట్టి పరిస్థితుల్లో ఆమెకు ఆగ్రహం కలిగించే పనులు చేయకూడదు. లక్ష్మి దేవి అనుగ్రహాన్ని ఎవరన్నా పొందాలి అంటే  ఆ తల్లికి ఇష్టమైన శుక్రవారం ఇలా చేయాలని శాస్త్రాలు చెబుతున్నాయి. ఏం చేయాలో కింద చూద్దాం..

లక్ష్మీ దేవికి పూజా విధానం ప్రతీ శుక్రవారం :
శుక్రవారం అంటే మనకి గుర్తుకువచ్చేది లక్ష్మీదేవి అందుకే అలాగే లక్ష్మి దేవికి ప్రతిరూపం శుక్రవారం కాబట్టి అమ్మవారిని రకరకాల పూలతో అలంకరించి, నైవేద్యాలు సమర్పించి అమ్మవారి ఆశిస్సులు అందుకోవాలి . ఆడవాళ్లు శుక్రవారం ఎరుపు లేదా ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించి, కాళ్ళు, చేతులు, ముఖానికి పసుపు రాసుకుని పూజిస్తే ఆ తల్లి కరుణ కటక్షాలతో పాటు సిరి సంపదలు ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఇలా  కనీసం ఐదు శుక్రవారాలు అయినా అమ్మవారి ప్రతిమ శుభ్రం చేసి గంధం, కుంకుమ బొట్టు పెట్టాలి అలాగే వివిధ రకాల పరిమళాలిచ్చే పూలను సమర్పించాలి. తరువాత మహలక్ష్మి కి నమస్కారం చేస్తూ మహాలక్ష్మి అష్టకాన్ని కనీసం ఒక్కసారైనా చదవాలి. మీరు చేసిన వంటలని కాని,ఫలాలని కాని అమ్మవారికి నైవేద్యంగా పెట్టి ఇంటిల్లపాదీ తింటే ఆర్ధిక ఇబ్బందులు ఉండవు ఇంట్లో డబ్బుకి  ఎలాంటి లోటు ఉండదు. అలాగే     మనం నైవేద్యంగా పెట్టిన పండ్లను ముత్తైదువుకి బొట్టు పెట్టి ఇస్తే ధనం మీ ఇంట్లో వర్షంలా కురుస్తుందని మన పూర్వీకులు,పండితులు చెప్తున్నారు

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *