డబ్బులు ఇచ్చి మరీ చెపం పగలకొట్టించుకుంటున్న భారతీయుడు

అమెరికాలో డబ్బులు ఇచ్చి చెపం పగలకొట్టించుకుంటున్నాడు భారత సంతతి వ్యక్తి. అదేంటి డబ్బులు ఇచ్చి చెంప పగలకోట్టించుకోవడం ఏంటి అనుకుంటున్నారా, అవును మీరు విన్నది నిజమే అయితే ఇందులో లాజిక్ కూడా ఉంది. మన భారతీయులు ఏం చేసినా అందులో అర్థం ఉంటుంది. మరి ఈ చెంప పగలదానికి అతడు డబ్బులు ఇవ్వడాని ఏంటి లింక్ అంటే..

మనీష్ సేతి అనే భారత సంతతి వ్యక్తి అమెరికాలో ఎన్నో ఏళ్ళ క్రితమే స్థిరపడ్డాడు. ఓ కంపెనీ పెట్టుకుని మెల్ల మెల్లగా ఎదిగి ఎంతో ఉన్నత స్థాయికి చేరుకున్నాడు.అయితే ఉన్నట్టుండి ఆయన కంపెనీ లాభాలు తగ్గిపోవడమే కాకుండా కంపెనీ క్రెడిబులిటీ కూడా దెబ్బతినడం మొదలు పెట్టింది. ఈ క్రమంలో తాను ఎక్కడ తప్పుచేస్తున్నాను అనే విషయాన్ని ఆలోచిస్తూ అసలు విషయం బుర్రకెక్కించుకున్నాడు. ఫేస్ బుక్ లో  నిత్యం గంటల తరబడి గడపటం కారణంగా తాను కంపెనీ గురించి పట్టించుకోవడం తగ్గించానని దాని ఫలితమే కంపెనీ లాభాలు తగ్గడానికి కారణమని తెలుసుకున్నాడు. దాంతో

Indian-American man hires woman to slap him every time he opens Facebook.  Elon Musk reacts - Trending News News

తాను ఫేస్ బుక్ చేసే ప్రతీ సారి గూబ గుయ్యిమనేలా కొట్టాలని అందుకు తాను గంటకు 8 డాలర్లు జీతంగా ఇస్తానని సోషల్ మీడియా వేదికగా ప్రకటన కూడా చేశాడు. దాంతో ఈ జాబు కోసం ఎంతో మంది వచ్చినా కారా అనే అమ్మాయిని ఎంపిక చేసుకున్నాడు. ఈ ఘటన మొత్తం 2012 లో జరిగింది అయితే తాజాగా ప్రపంచ కుబేరుడు ఎలన్ మాస్క్ ఈ విషయంపై ట్వీట్ చేయడంతో మళ్ళీ తెరపైకి వచ్చింది.  మనీష్ సేతి ఫేస్ బుక్ చూస్తుంటే క్లారా చేయి చేసుకున్న వీడియో పై మీరు ఓ లుక్కేయండి.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *