గోవాలో పారికర్ ఘన విజయం

గోవాలో జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్‌ పారికర్‌ విజయం సాధించారు. ఆగస్టు 23న దేశవ్యాప్తంగా నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరిగాయి. నేడు ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. గోవాలోని పనాజీ, వాల్పోయి, దిల్లీలోని బావన, ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాలలో ఈ ఎన్నికలు జరిగాయి. సోమవారం జరిగిన ఓట్ల లెక్కింపులో పారికర్‌ సమీప కాంగ్రెస్‌ అభ్యర్థి గిరీశ్‌ రయ చోదంకర్‌పై 4803 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. వాల్పోయిలో భాజపా అభ్యర్థి విశ్వజిత్‌ రానే ఆధిక్యంలో ఉన్నారు.

manohar parrikar win in goa కోసం చిత్ర ఫలితం

క్రిందటి ఏడాది  గోవా లో జరిగిన  అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపి  13 స్థానాల్లో గెలుపొంది చిన్న పార్టీల మద్దతుతో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.దాంతో అప్పట్లో  కేంద్ర రక్షణ మంత్రిగా ఉన్న మనోహర్‌ పారికర్‌,ఆ పదవికి రాజీనామా చేసి గోవా సీఎంగా బాధ్యతలు చేపట్టారు. బావన నియోజకవర్గంలో కాంగ్రెస్‌ ఆధిక్యంలో ఉంది.  ఎమ్మెల్యేగా గెలుపొందిన నేపథ్యంలో వచ్చేవారం రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామాచేస్తునట్టుగా సీయం పారికర్ తెలిపారు .

 

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *