jamili elections 2022

జమిలి ఎన్నికలకు రంగం సిద్దం…!!!

“ఒకే దేశం, ఒకే సారి ఎన్నికలు” జరగాలని, ఇది భారత్ కు ఎంతో అవసరమని మరో సారి నొక్కి మరీ చెప్పారు భారత్ ప్రధాని నరేంద్ర మోడీ. మరో సారి జమిలి ఎన్నికల అంశాన్ని ప్రస్తావించారు. అంతేకాదు ఈ ఎన్నికలు జరగడానికి సర్వం సిద్దం అనే సంకేతాలు కూడా ఇచ్చారు.

Modi Decided to hold simultaneous elections and go to the Jamili war | 2022  జమిలి ఎన్నికలు ఖాయం.. నో డౌట్.. ఎందుకంటే? | Tupaki Telugu

80 వ అఖిల భారత ప్రిసైడింగ్ ఆఫీసర్ల వీడియో సమావేశంలో మాట్లాడిన మోడీ దేశమంతా ఒకే సారి ఎన్నికలు అనేది కేవలం చర్చకు మాత్రమే కాదు దేశానికి ఇది ఎంతో అవసరం , దేశ వ్యాప్తంగా ఎక్కడో ఒక చోట ఎన్నికలు జరుగుతూనే ఉంటాయి , వీటి వలన అభివృద్ధి పనులపై ప్రభావం పడుతోంది అందుకే ఒకే సారి ఎన్నికలు ఒకే దేశం అనేట్టుగా చర్చలు జరగాల్సిన అవసరం ఉందని, మోడీ పిలుపు ఇచ్చారు.PM Modi's handling of coronavirus crisis in India needs to be recognised,  Opinions & Blogs News | wionews.com

అసెంబ్లీ, లోక్ సభ, పంచాయితీ లకు ఒకే ఓటర్ల జాబితా ఉండాలని మోడ్ తెలిపారు. అయితే గత కొంత కాలంగా జమిలి ఎన్నికలపై చర్చలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికలు నిర్వహించేదుకు అన్ని రాష్ట్రాలు మద్దతు తెలిపాయి కూడా..అయితే మోడీ తాజాగా జమిలి ఎన్నికలపై లోతైన చర్చలు జరగాలని వ్యాఖ్యలు చేయడంతో జమిలి ఎన్నికలకు రంగం సిద్దమయ్యిందని అంటున్నారు నిపుణులు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *