చంద్రబాబు కి జలక్ ఇచ్చిన “మోడీ”

చంద్రబాబునాయుడు ఆశల మీద మోడీ నీళ్ళు జల్లారు . కేంద్ర మంత్రివర్గ విస్తరణలో ఏపి బీజేపీ తరుపున కంభంపాటి హరిబాబుకి అవకాశం దక్కుతుందని ఆశించారు టీడీపి అధినేత చంద్రబాబు.డిల్లీ వర్గాలు కూడా హరిబాబుని రమ్మని పిలవడంతో బాబు తెగ సంబరపడిపోయాడు.ఎందుకంటే వెంకయ్యనాయుడు లా హరిబాబు కూడా  చంద్రబాబు లా మంచి సన్నిహితుడు   బాగా.ఇటీవల జరిగిన కాకినాడ ఎన్నికల్లోనూ బీజేపీ, టీడీపీ పొత్తులో బీజేపీకి స్థానాలను తగ్గించినా హరిబాబు సహకారంతోనే పార్టీలో అసమ్మతి గళం విప్పకుండా చంద్రబాబు జాగ్రత్త పడ్డారు.

chandrababu modi కోసం చిత్ర ఫలితం

విశాఖ రైల్వే జోన్ వచ్చేనా ?

వెంకయ్యనాయుడు ఉన్నప్పుడు విశాఖకి రైల్వే జోన్ కోసం విశ్వప్రయత్నం చేశారు కానీ ఉపరాష్ట్రపతి అవ్వడంతో ఆ ఛాన్స్ లేకుండా పోయింది.అలాగే ఏపి నుంచి ప్రాతినిధ్యం వహిస్తు రైల్వే శాఖ మంత్రిగా ఉన్న సురేష్ ప్రభు సయితం రైల్వే శాఖ మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఇప్పుడు రైల్వే శాఖ ఎవరికి దక్కుతుందో తెలియదు. ఇక బీజేపీ మంత్రులతో లాబీయింగ్ చేసే శక్తి, సామర్ధ్యం కేంద్రమంత్రి సుజనా చౌదరికి లేదు. అశోక్ గజపతి రాజు ఆ పనికి పూనుకోరు. దీంతో విశాఖకు చెందిన హరిబాబుకు మంత్రి పదవి దక్కితే ఏపీ పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయించుకోవచ్చని చంద్రబాబు భావించారు. ఇది ఇలా ఉంటే రాష్ట్రపతి,ఉపరాష్ట్ర పతి ఎన్నికల్లో చంద్రబాబు కి కాల్ చేసి మరీ మద్దతు అడిగిన మోడీ,అమిత్ లు మంత్రి వర్గ విస్తరణలో మాత్రం చంద్రబాబు ని పక్కన పెట్టేశారు.ఈ పరిణామాలు టీడీపి నేతలకి మింగుడుపడటం లేదట.

 

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *