షాకింగ్ ఆఫర్: జియో ఫోన్ ఫ్రీ…ఫ్రీ….
రిలయన్స్ సంస్థ వార్షిక సాధారణ సమావేశంలో అవిష్కరించిన జియో ఫీచర్ ఫోన్‌ను భారతీయులందరికి ఉచితంగా అందించనున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ దిమ్మతిరిగిపోయే ఆఫర్ ఇచ్చారు. కేవలం రూ. 1500 డిపాజిట్ చేస్తే చాలు ఫోన్ ఫ్రీగా వస్తుంది. అయితే ఈ డిపాజిట్‌ను 3 నెలల తర్వాత కస్టమర్లకు రిఫండ్ చేయాలని నిర్ణయించినట్లు ఆసక్తికర ప్రకటన చేశారు. ఆగస్ట్ 24 నుంచి ఈ ఫీచర్ ఫోన్లు బుకింగ్స్ చేసుకోవచ్చు. సెప్టెంబర్ 1నుంచి ఈ ఫోన్ అందుబాటులోకి రానుంది.
ఈ కొత్త జియో ఫోన్ వినియోగదారులకు వాయిల్ కాల్స్ పూర్తిగా ఉచితం. డేటా ప్యాక్ రూ.153కే నెల రోజుల వ్యాలిడిటీతో అన్ లిమిడెట్ డాటా అందుబాటులోకి రానుంది. నెలకు రూ.309తో జియో టీవీ సౌకర్యం కల్పించామని, జియో ఫోన్ ద్వారా టీవీకి కనెక్ట్ చేసుకునే సదుపాయం ఉంది. ఎమర్జెన్సీలో లొకేషన్ షేర్ చేసే ఆప్షన్ ఉండటం విశేషం. ప్రతి వారం 50లక్షల ఫోన్లు విడుదల చేయనున్నారు.
జియో ఫోన్ ఫీచర్స్ ఇవే :
– జియో ఫోన్ రూ.3,000 నుంచి రూ.4,500 మధ్య ఉంటుంది.
– జియో స్మార్ట్ ఫోన్ లో బేసిక్ ఇంటర్నెట్, వాయిస్ కాల్స్ ఉచితం
– వాయిస్ కమాండ్ కంట్రోల్ సిస్టమ్ ఉంది. 22 భాషల్లో ఈ ఫోన్ సపోర్ట్ చేస్తోంది.
– హైటెక్ సెక్యూరిటీ ఫీచర్స్ తో ఇంత తక్కువ ధరలో మరో ఫోన్ లేదని తెలిపారు.
– వాయిస్ మేసేజ్ లు పంపించుకోవచ్చు. 4-way నావిగేషన్ సిస్టమ్ కూడా ఉంటుంది.
– ఫోన్ లోని బటన్స్ లో ఐదవ అంకె ఎమర్జెన్సీ బటన్ గా పని చేస్తోంది. ఈ బటన్ నొక్కితే మీరున్న లోకేషన్ కూడా షేర్ అవుతుంది.