వైసీపీలోకి నాదెండ్ల మనోహర్…???

జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ తరువాత ఆ స్థాయిలో పార్టీ వ్యవహారాలు చూసుకునే నేత ఎవరైనా ఉన్నారంటే అది కేవలం నాదెండ్ల మనోహన్ అని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. పవన్ కళ్యాణ్ కి తోడుగా ఉంటూ పార్టీలో అగ్ర శ్రేణి నాయకుడిగా పవన్ కి అత్యంత సన్నిహితుడిగా ఉన్న నాదెండ్ల మనోహర్ త్వరలో జనసేన పార్టీని వీడి అధికార పార్టీ వైసీపీ చెంతకు చేరనున్నారే వార్తలు గుప్పు మంటున్నాయి. జనసేనలో క్రియాశీలక పాత్ర పోషించిన నాదెండ్ల పార్టీ మారనున్నారనే వార్తలు ఇప్పుడు రాజకీయవర్గాలలో అతిపెద్ద చర్చకు దాడి తీస్తున్నాయి.

Nadendla Manohar seeks support from farmers for Pawan Kalyan's one-day  hunger strike on December 12

రాజకీయంగా ఎదుగుదల కోసం జనసేన లోకి వచ్చిన నాదెండ్ల మనోహర్ కి అనుకున్న స్థాయిలో జనసేన విజయాలు సాధించలేక పోవడంతో భవిష్యత్తులో రాజకీయ అడుగులు ఎలా వేయాలి అనే విషయంపై గత కొంత కాలంగా మధన పడుతున్నారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. అందుకే భవిష్యత్తుపై ఆలోచనతో నాదెండ్ల వైసీపీలోకి ఎంట్రీ ఇవ్వనున్నారనే వార్తలు కూడా చక్కర్లు కొడుతున్నాయి. వైసీపీకి చెందిన ఓ ఎమ్మెల్యే తో మనోహర్ టచ్ లో ఉన్నారని పలు దఫాలుగా చర్చలు కూడా ఇద్దరి మధ్యన జరిగాయనేది విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.అయితే

Nadendla Shuts Mouths On Quitting JSP!

ప్రస్తుతం ఈ విషయం ఊహజనితంగా ఉన్నప్పటికీ త్వరలో అధికారిక ప్రకటన ద్వారా మనోహర్ ఎంట్రీ ఉంటుందనేది కొందరి వాదన. ఇదిలాఉంటే మనోహన్ మరొక వైసీపీ కీలక నేతతో కూడా ఈ విషయంపై చర్చలు జరిపారని మొనోహర్ ఎంట్రీ కి జగన్ కూడా సుముఖంగా ఉన్నారని తెలుస్తోంది. ఒక వేళ ఇదే గనుకా జరిగితే జనసేన అధినేత పవన్ కళ్యాన్ కి ఊహించని షాకే నని అంటున్నారు పరిశీలకులు. అసలు జనసేన పార్టీలో కీలక వ్యక్తిగా ఉన్న నాదెండ్ల ఎందుకు పార్టీని వీడుతారు ఇద్దరి మధ్య మనస్పర్ధలు ఏమైనా వచ్చాయా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే నాదెండ్ల ఎట్టిపరిస్థితుల్లోనూ వైసీపీలో చేరరని, జనసేన పార్టీలోనే ఉంటారని అంటున్నారు,పార్టీని బలహీన పరచడానికి చేస్తున్న కుట్రలని కొట్టి పారేస్తున్నారు పార్టీ నేతలు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *