క్లారిటీ ఇచ్చేసిన నాదెండ్ల..!!

జనసేన పార్టీ కీలక నేత, జనసేనానికి అత్యంత సన్నిహితుడుగా ఉన్న నాదెండ్ల మనోహర్ పార్టీ వీడుతున్నారని, పవన్ కళ్యాణ్ కు, పార్టీకి దూరంగా ఉంటున్నారని, జనసేన పార్టీపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని, ఇక పార్టీని వీడడమే తరువాయి, వైసీపీతో టచ్ లో ఉన్నారంటూ గత కొన్ని రోజులుగా వస్తున్న వార్తలకు చెక్ పెట్టారు నాదెండ్ల మనోహర్.

Nadendla on the way out of Jana Sena? - Great Andhra English | DailyHunt

కొన్ని రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఏపీలో పలు గ్రామాలు జలదిగ్బంధంలో ఉండిపోయాయి. అంతేకాదు గత ప్రభుత్వం నాసిరంగా వేసిన రోడ్లపై వరుణుడి ప్రభావం తోడవడంతో అవి కాస్తా గుంతలు పడుతూ వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. ఈ క్రమంలో పలు గ్రామాలలో పర్యటించిన నాదెండ్ల మనోహర ప్రజలు ఆదుకోవాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. అంతేకాదు

Govt neglected development of Tenali: Ex-speaker Nadendla Manohar - Times  of India

దసరా పండుగ వస్తున్న సమయంలో పక్క రాష్ట్రమైన హైదరాబాద్ నుంచీ ఎంతో మంది ఏపీ ప్రజలు సొంత ప్రాంతాలకు వెళ్తారని, కనీసం వారికి ప్రభుత్వం ఆర్టీసీ బస్సులు కూడా వేయాలని పరిస్థితిలో ఉందని ఆర్టీసీ బస్సుల విషయంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని మండిపడ్డారు. రైళ్ళ సేవలు పూర్తిగా అందుబాటులోకి రాలేదని ఇలాంటి సమయంలో ప్రభుత్వం చొరవ తీసుకోకపోతే ఎలా అంటూ ప్రశ్నించారు. అయితే నాదెండ్ల పార్టీ మారుతున్నారు అంటూ తాజాగా వచ్చిన ఊగాహానాలకు నాదెండ్ల ఇలా బ్రేక్ వేశారని అంటున్నారు పరిశీలకులు.

 

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *