అగ్ర రాజ్యంలో ఓ వీధికి “భారతీయురాలి” పేరు…ఎందుకో తెలుసా..!

అగ్ర రాజ్యం అమెరికాలో భారతీయురాలికి అరుదైన ఘన కీర్తి దక్కింది. 1915 లోనే అమెరికా వెళ్లి స్థిరపడిన కలా  బాగాయ్ పేరు ఇప్పుడు అమెరికాలో మారు మోగుతోంది. జాత్యాహంకారాన్ని భరించి సహించి, ఎన్నో సవాళ్లు ఎదుర్కుని నేను ఉన్నాను అంటూ ఎంతో మంది భారతీయులకి అండగా నిలిచింది కలా  బాగాయ్. అమెరికా చరిత్రలో తన పేరు కూడా స్థిరంగా నిలిచిపోయేలా ఆమె జీవితం నిలిచింది..ఇంతకీ ఆమె ఎవరు, ఆమె సాధించిన ఘనత ఏమిటి..??

Indian American Kala Bagai, a Victim of Racism in USA, Gets a Street Named  After Her

అమృతసర్ లో పుట్టిన కలా బాగాయ్ కు 11 ఏళ్ళకే వివాహం జరిగింది. పెళ్లి తరువాత తన భర్త తో కలిసి అమెరికా వెళ్ళింది. అమెరికాలోని బర్కీలో ఉండే కలా బాగాయ్ కుటుంభానికి నిరంతరం జాత్యహంకార నిరసనలు ఎదురవుతూ ఉండేవి అప్పట్లో అమెరికా వ్యాప్తంగా కేవలం 2 వేల మంది మాత్రమే ఉండేవారు. అయినప్పటికీ ఆమె కుటుంభం నిత్యం జాతి వివక్షకి గురవుతూనే ఉండేది. అయితే ఏ మాత్రం చెక్కు చెదరకుండా, భయపడకుండా కలా బాగాయ్ ధైర్యంగా జాత్యాహంకారాన్ని ఎదుర్కొంది.

Indian Americans want a Berkeley street named after Kala Bagai

అదే సమయంలో అమెరికాకి వలస వచ్చిన భారతీయులకి ఎంతో ధైర్యం చెప్పేది. అమెరికాలో భారతీయులు ఉండటానికి గల హక్కులని వివరించి చెప్పేది. ఎవరూ కూడా జాత్యాహంకారానికి గురి కాకుండా పలు ప్రచార కార్యక్రమాలు చేపట్టేది. 1983 లో మృతి చెందిన కలా బాగాయ్ చివరి వరకూ కూడా భారతీయుల హక్కుల కోసం పోరాటం చేసింది. దాంతో ఆమె సేవలని గురించిన స్థానిక ప్రభుత్వం ఆమె పట్టుదలకి,పోరాట పటిమకు గుర్తుగా ఆమెని గౌరవించుకునే క్రమంలో అమెరికాలోని కాలిఫోర్నియాలో ఓ వీధికి ఆమె పేరు పెట్టి గౌరవించుకుంది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *