నందమూరి హరికృష్ణ “దుర్మరణం”…అసలు కారణం ఇదే

సినీ హీరో టీడీపీ సీనియర్ నేత మాజీ ఎంపీ నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలోదుర్మరణం పాలయ్యారు.. చెందారు. నెల్లూరు నుంచి హైదరాబాద్‌ వస్తుండగా అన్నేపర్తి దగ్గర డివైడర్‌ను ఢికొట్టిన కారు పల్టీలు కొడుతూ రోడ్డు పక్కకు పడిపోయింది..దాంతో కారులోంచి బయటకు పడిపోయిన హరికృష్ణకు తలకు  శరీరానికి తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రమాదం జరిగిన కొద్దిసేపటికి హరికృష్ణను స్థానికులు నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రికి తరలించారు. అయితే.. వెంటనే స్పందించిన వైద్యులు చికిత్స అందించేందుకు ప్రయత్నించినా ఉపయోగం లేకుండా పోయింది.

Image result for nandamuri hari krishna road accident
ఇదిలాఉంటే ప్రమాదం జరిగిన స్థలంలో రెండు వాహనాలు ఉండడంతో.. హరికృష్ణ రోడ్డుపై పడిపోవడంతో హరికృష్ణ ప్రయాణిస్తున్న కారు వేగంగా వెళ్లి పల్టీ కొట్టిందా..? లేక ముందు వెళ్తున్న వాహనాన్ని ఢీకొట్టిందా లేక వేరే వాహనం రాంగ్‌రూట్‌లో వచ్చి ఎదురుగా ఢీకొట్టిందా. లేక  ఆ సమయంలో అసలు ఆయన సీట్ బెల్ట్ పెట్టుకున్నారా లేదా  అనే పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రమాదం గురించి తెలుసుకున్న నందమూరి అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు

Image result for nandamuri hari krishna road accident

అయితే గతంలో హరికృష్ణ పెద్ద కుమారుడు నందమూరి జానకి రామ్ నల్గొండ జిల్లా మునగాల మండలం ఆకుపాముల దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే..2009 ఎన్నికల ప్రచారానికి వెళ్లి వస్తూ జూ..ఎన్టీఆర్ ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే…అప్పట్లో ఎన్టీఆర్‌కు రోడ్డు ప్రమాదం జరగిన ప్రాంతంలోనే జానకి రామ్ కారు ప్రమాదానికి గురి అయింది. ఇప్పడు హరికృష్ణకు కూడా అదే జిల్లాలో ప్రమాదం జరిగింది..

 

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *