“నోటా” మూవీ రివ్యూ 

సినిమా – నోటా

రేటింగ్  –  2.5 / 5

బ్యానర్‌ –   స్టూడియో గ్రీన్

నటీనటులు –  విజయ్ దేవరకొండ, మెహ్రీన్ పిర్జాదా, నాజర్‌, సత్యరాజ్‌

కొరియోగ్రఫీ –   సంతానా కృష్ణన్ రవిచంద్రన్

సంగీత దర్శకుడు –   శక్తీకాంత్ కార్తీక్

దర్శకుడు –   ఆనంద్ శంకర్

Image result for nota poster

పెళ్లి చూపులు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి అర్జున్ రెడ్డి తో బాక్స్ ఆఫీస్ షేక్ చేసి ఒక్క సినిమాతోనే యువ అగ్ర హీరోల స్థాయికి చేరుకున్న ఏకైక నటుడు విజయ్ దేవరకొండ..ఇండస్ట్రీ లో తనకంటూ ఒక సపరేట్ క్రేజ్ ఉన్న హీరోగా అర్జున్ రెడ్డి అలియాస్ విజయ కి మాంచి పేరుంది..ఆ తరువాత గీత గోవిందం సినిమాతో బ్యూటిఫుల్ లవ్ స్టొరీతో మరో సాగి బిగ్ హిట్ సంపాదించాడు విజయ్ అయితే ఈ సారి ప్రయోగాత్మకంగా నోటా తో ముందుకు వచ్చాడు అయితే ఈ సినిమా ఎలా ఉంది..? సినిమాలో విజయ ఎలా నటించాడు..కధ కధనాలు ఇవన్నీ ఒక్కసారి పరిశీలిద్దాం సామాన్య ప్రేక్షకుడికి ఈ సినిమా రీచ్ అయ్యిందో లేదో చూద్దాం..

కధ –

ఓ ముఖ్యమంత్రి  కొడుకుగా ఎంతో సాఫీగా హాయిగా ఎంజాయ్ చేస్తూ సాగిపోయే వరుణ్ (విజయ్ దేవరకొండ ) జీవితం ఒక్కసారిగా తన తండ్రి జైలుకు వెళ్ళడంతో మలుపు తిరుగుతుంది..తెలంగాణా ముఖ్యమంత్రి వాసుదేవ్ (నాజర్ ) ఒక స్వామీజీ సలహా మేరకు ఆయన కొడుకు వరుణ్ ని ముఖ్యమంత్రిగా చేస్తాడు..అవినీతి ఆరోపణలపై వాసుదేవ్ జైలుకు వెళ్ళడంతో రాష్రంలో ఒక్కసారిగా రాజకీయ పరిస్థితులు మారిపోతాయి..వరుణ్ ని సరికొత్త  రాజకీయ నాయకుడిగా తీర్చిదిద్దుతుంది. అయితే ఆ తరువాత జరిగే పరిణామాలు ఏమిటి..? వారిని వరుణ్ ఎలా ఎదుర్కొంటాడు..తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏమి జరుగుతుంది అనే కధాంశం తో సాగుతుంది.

ఫెర్ఫామెన్స్ :

వాస్తవానికి ఈ సినిమా నేపధ్యం విజయ్ సూట్ అవ్వలేదనే చెప్పాలి. ఇంకా ఈ సినిమా కథాంశంపై సరిగ్గా కధకుడు దృష్టి పెట్టి ఉంటె యువతను ఆకర్షించే ఎన్నో అంశాలని కధలో పొందు పరచవచ్చు.. ఇందులో విజయ్ పాత్రను తప్పు పట్టడంలేదు కానీ… ఈ సినిమాలో విజయ్ పాత్ర ఆయన స్థాయికి తగ్గట్టుగా లేదనే చెప్పాలి. ఇక  హీరోయిన్  మెహ్రీన్ పాత్ర విషయానికి వస్తే అతిధి పాత్రలో ఉన్నట్టు కనిపిస్తుంది. కాబట్టి పెద్దగా చెప్పుకోవాల్సినంత ఏమీ లేదు…సీనియర్ నటులు నాజర్, సత్యరాజ్ సుదీర్ఘమైన ప్రాధాన్యత కలిగిన పాత్రలు పొందారు. ఈ చిత్రంలోని చాలా సీన్లు  ఈ రెండు పాత్రలతో ముడిపడి ఉంటాయి. ఈ రెండు పాత్రలు సినిమాకి బాగా ఉపయోగపడ్డాయి. రెండవ భాగంలో నాజర్ మేకప్ కొద్దిగా ఎబ్బెట్టుగా కనిపించింది.  ఎం ఎస్ భాస్కర్, ప్రియదర్శి  ఈ సినిమాలో కీలకపాత్రలు పోషించారు.

విశ్లేషణ : 

యంగ్ అండ్ క్రేజీ  హీరోతో ఒక రాజకీయ కోణాన్ని నడిపించాలని ప్రయత్నించారు. అయితే ఈ కధలో అంత దమ్ము ఎక్కడా కనిపించలేదు వాస్తవానికి ప్రతి రాజకీయ కథ లోతుగా ఉండకపోయినా, ప్రేక్షకులను 2.5 గంటల పాటు ఉంచడానికి కనీస ఆసక్తిని కలిగించే కథ అవసరం. సామాన్యుల సమస్యల మీద పోరాడుతూ .. పరిష్కారాలు వెతకడం .. ఇందులో ఉండే రాజకీయాలు  ఈ సినిమాలో చూపించారు. ఈ సినిమాలో మొదటి భాగం ఫర్వాలేదు అనిపించినా .. రెండో భాగం ప్రేక్షకుల సహనానికి పరీక్షా పెడుతుంది. ముఖ్యంగా చెప్పుకోవాలంటే సరైన సంభాషణలు ఈ సినిమాలో కనిపించవు…ఈ సినిమాలో స్వామీజీ ఎపీసోడ్ అంతా చాలా గందరగోళంగా అనిపిస్తుంది.

రాజకీయ కుట్రలు, ఆసుపత్రి సన్నివేశాలు, రిసార్ట్ క్యాంప్ సన్నివేశాలతో కలిసిన రాజకీయ నాటకం, తమిళనాడు రాజకీయాలను మనకి గుర్తుచేస్తుంది. ఇక ఈ సినిమాలో పాటలు కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. ఇక ఈ సినిమాలో కామెడీ కూడా పెద్దగా పండలేదు. నాజర్ ప్లాష్ బ్యాక్ .. సత్యరాజ్ పాత్రల పొడవు ఎక్కువయినట్టుగా కనిపిస్తోంది..ముఖ్యంగా ఈ సినిమా టైటిల్ కి తగ్గట్టుగా ఎక్కడ కూడా కధనం ఉండదు..

+ లు

  • విజయ్ దేవరకొండ నటన
  • నేపథ్య సంగీతం
  • డైలాగ్స్

– లు

  • క్లైమ్యాక్స్
  • సెకండ్ హాఫ్
  • కామెడి

చివరిగా నోటా తో దేవరకొండకి నో యూజ్

 

 

 

 

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *