ఎన్టీఆర్ రికార్డ్ ని అందుకోలేని మహేష్…

ఒక హీరో నటన,హావభావాలు,డ్యాన్స్ లు,ఫైట్లు,అభిమానులు ఈ ఆధారంగా ఆ హీరో స్థాయిని ,ఇమేజ్ ని లెక్కకట్టేవారు. అయితే ఇప్పుడు హీరో సినిమా టీజర్స్ , ట్రైలర్స్ కి  యుట్యూబ్ లో వచ్చే వ్యూస్ మరియు లైక్స్ ద్వారా హీరోకి ఎంత కెపాసిటీ ఉందో లేక్కకడుతున్నారు .

తాజాగా  మహేష్ నటిస్తున్న స్పైడర్ సినిమా టీజర్ సోషల్ మీడియాలో రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది. ఓవైపు టీజర్ లో కొత్తదనం కొరవడింది చాలా రొటీన్ గానే ఉంది అని సగటు ప్రేక్షకులు అనుకుంటున్నా ఆ వీడియో ని చూసే వాళ్ళ సంఖ్య తగ్గలేదు  . తాజాగా స్పైడర్ టీజర్ కు కోటి వ్యూస్ వచ్చాయి. అయితే ఇంత హంగామా నడుస్తున్నప్పటికీ ఎన్టీఆర్ క్రియేట్ చేసిన ఓ రికార్డును మాత్రం మహేష్ బద్దలుకొట్టలేకపోయాడు.

ఎన్టీఆర్ నటిస్తున్న జైలవకుశ రిలీజ్ అయిన కొన్ని గంటల్లోనే అత్యధిక వ్యూస్ సాధించిన టీజర్ గా జై లవకుశ నిలిచింది .ఈ సినిమాకు సంబంధించి జై టీజర్ కు కేవలం 24 గంటల్లోనే 4.98 మిలియన్ వ్యూస్ వచ్చాయి. స్పైడర్ టీజర్ కు మాత్రం ఒక రోజులో 4.04 మిలియన్ వ్యూస్ మాత్రమే వచ్చాయి.ఈ విషయంలో ఎన్టిఆర్ ముందు వరసలో నిలవడానికి కారణం ఒక్కటే తనకున్న మాస్ ఆడియన్స్ మరియు క్లాస్ ప్రేక్షకులు అందరిని బ్యాలన్స్ చేసుకుంటూ అందరిని మెప్పించడమే

అయితే స్పైడర్ టీజర్ కు సంబంధించి మొదట్నుంచి తెలుగు, తమిళ్ వ్యూస్ కలిపి చెబుతున్నారు. అలా 24 గంటల్లోనే 8.6 మిలియన్ వ్యూస్ వచ్చాయని చెబుతున్నారు. అది కూడా ఫేస్ బుక్, యూట్యూబ్ వ్యూస్ కలిపి చెబుతున్నారు. కేవలం తెలుగు వెర్షన్ కు సంబంధించిన లెక్కలు చూసుకుంటే మాత్రం జై టీజర్ దే మొదటి స్థానం. మూడో స్థానంలో కాటమరాయుడు టీజర్ నిలవగా.. 4, 5 స్థానాల్లో డీజే, సాహో సినిమా టీజర్లు నిలిచాయి.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *