“ఎన్టీఆర్ కధానాయకుడు” రివ్యూ

సినిమా – ఎన్టీఆర్ కధానాయకుడు

రిలీజ్ డేట్ – 09 -01 -2019

దర్శకత్వం    –    క్రిష్

సంగీతం  –  M.M  కీరవాణి

నిర్మాత  –  నందమూరి బాలకృష్ణ

నటీనటులు – బాలకృష్ణ ,విద్యాబాలన్ ,రాణా , శ్రేయ,నిత్యామీనన్ ,రకుల్…

 

ఎన్టీఆర్ పేరు వినపడగానే గుర్తుకు వచ్చేది పౌరాణిక పాత్రల్లో కృష్ణుడు ,రాముడి రూపాలలో ఆయన రూపం. నిజంగా భగవంతుడే నిలిచున్నాడా అనేట్టుగా ఉంటుంది ఆ ఆహార్యం. తెలుగు చిత్ర సీమ ఉన్నంత వరకూ ఆయన ఖ్యాతి అజరామరంగా నిలిచి ఉంటుంది. తెలుగు వారికి ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఘనకీర్తిని తెచ్చి పెట్టిన ఏకైక వ్యక్తి ఎన్టీఆర్ అనడంలో సందేహం లేదు. అయితే ఎన్టీఆర్ జీవిత చరిత్రని బయోపిక్ రూపంలో ఆయన తనయుడు నందమూరి బాలకృష్ణ ఈరోజు తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.మరి ఈ సినిమా ఎలా ఉందొ తెలుగు స్టార్ న్యూస్ విశ్లేషణలో చూద్దాం.

3

సినిమా కథ :

ఎన్టీఆర్ సతీమణి బసవతారకమ్మ అనారోగ్య పరిస్థితులలో ట్రీట్మెంట్ చేయిస్తున్న పరిస్థితుల నుంచీ కధ మొదలవుతుంది. ఎన్టీఆర్ బెజవాడలో రిజిస్ట్రార్ గా 1947 లో చేసేవారు. అయితే సినిమాల మీద ఇష్టంతో ఉద్యోగానికి రాజీనామా చేసి హీరో అవ్వాలని మద్రాస్ వెళ్తారు. ఈ క్రమంలో అవకాశాలు రాక ఎన్నో ఇబ్బందులు పడటం. ఆ తరువాత మాయాబజార్ సినిమాలో కృష్ణుడిగా క్లిక్ అవ్వడంతో ఒక్క సారిగా ఎన్టీఆర్ స్టార్ మారిపోతుంది. అయితే బసవ తారకమ్మ తన జీవితంలో ఎలాంటి ప్రభావం చూపించిందో తలుచుకుంటూ కధ ముందుకు వెళ్తుంది.

2

నటీనటుల ప్రతిభ..

 

ఈ సినిమా మొత్తం బాలకృష్ణ నటన, కధ పై ఆధారపడి నిలిచింది. బాలయ్య తన తండ్రి పాత్రలో ఎంత గొప్పగా నటించాడో సినిమా చూసిన ప్రతీ ఒక్కరికి అర్థం అవుతుంది. బాలయ్య తన తండ్రిలా అచ్చు గుద్దినట్టు కనిపిస్తారు. అంతేకాదు ఎన్టీఆర్ లా నవ్వడం , హావభావాలు పలికించడం చూస్తె ఒక్కో సీన్లో ఎన్టీఆర్ నటిస్తున్నడా అనే భావన కలుగుతుంది. డైలాగ్ డెలివరీ లో సైతం బాలయ్య ఎన్టీఆర్ దించేశాడు.ఇక బసవతారకమ్మ పాత్రలో

6

విద్యా బాలన్ 100 కి 100 శాతం ఎంతో గొప్పగా నటించింది. ఏయన్నార్ గా సుమంత్ నటన చూసిన వారికి సుమంత్ లో కొత్త నటుడిని పరిచయం చేస్తుంది. ఇక చంద్రబాబు గా రాణా సెట్ అయ్యాడు. మిగతా హీరోయిన్స్ గా శ్రీదేవి, జయసుధ, జయప్రదలుగా రకుల్.. పాయల్.. హాన్సిక కనిపించి అలరించారు. సావిత్రి పాత్రలో నిత్యా మీనన్ కనిపించి ఒక్క సారిగా అందరికి షాక్ ఇచ్చింది.

 

సాంకేతిక పరంగా:

ఎన్టీఆర్ కధానాయకుడు సినిమాకి పెద్ద అసెట్ జ్ఞానశేఖర్ సినిమాటోగ్రఫీ. సినిమా ఎంతో అందంగా ఉందంటే కారణం  జ్ఞానశేఖర్  ప్రతిభనే చెప్పాలి.అద్భుతంగా ఉంది.  సినిమాలో అన్ని గెటప్పులలో బాలకృష్ణని చాలా అందంగా చూపించారు జ్ఞానశేఖర్..సినిమా చూసిన ప్రతీ ఒక్కరూ జ్ఞానశేఖర్ కి మార్కులు వేయకుండా ఉండరు.ఇక సినిమా మ్యూజిక్ విషయానికి వెళ్తే.. కీరవాణి మ్యూజిక్ సినిమాకి హైలెట్ అయ్యిందనే చెప్పాలి. క్రిష్ దర్సకత్వ ప్రతిభ మరో సరి స్పష్టంగా కనపడింది. నిర్మాతగా బాలయ్య కూడా విజయం సాధించాడు.

1

విశ్లేషణ :

 

ఎన్టీఆర్ కధానాయకుడు లో ఎన్టీఆర్ సినిమా జీవితం ఎలా మొదలయ్యింది. అంచెలంచలుగా ఎన్టీఆర్ సినీ ప్రస్థానం, క్రిష్ చూపించిన విధానం అధ్బుతంగా ఉన్నాయి. సినిమాలో ఎమోషనల్ సీన్స్ క్రిష్ ఎంతో గొప్పగా తీశారు. ఎన్టీఆర్ తన పెద్ద కొడుకు చనిపోయినప్పుడు భాధ పడే సీన్స్ ప్రేక్షకులని కట్టిపడేస్తుంది. బాలయ్య ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రలో నటించినట్టు అనిపించదు ఎన్టీఆర్ సినిమాలో చేస్తున్నారా అనే ఫీలింగ్ కలుగుతుంది. ఎన్టీఆర్ గురించి ఎవరికీ తెలియని కొత్త విషయాలు క్రిష్ పరిశోధించి ప్రేక్షకులకి చూపించారు. ఎన్టీఆర్ పొలిటికల్ ఐడియాలజీ సీన్స్ సినిమా కథలో కరెక్ట్ టైమింగ్ లో వస్తాయి. సరిగ్గా అదే సమయంలో చంద్రబాబు గా రానా ఎంట్రీ ఇస్తాడు. దాంతో సినిమా ఎండ్ అవుతుంది

 

ప్లస్ పాయింట్స్ :

బాలకృష్ణ

సినిమాటోగ్రఫీ

మ్యూజిక్

సినిమా సెట్స్

ఎన్టీఆర్ గెటప్స్

మైనస్ పాయింట్స్ :

సెకండ్ హాఫ్

రేటింగ్ : 3/5

బోటం లైన్ – ప్రేక్షకులని మెప్పించిన ఎన్టీఆర్ “కధా”నాయకుడు

 

 

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *