బిగ్ బ్రేకింగ్ : చంద్రబాబు కు నోటీసులు..!!!

టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి చిత్తూరు జిల్లా పోలీసులు నోటీసులు జారీ చేశారు. సోమల మండలం పెద్దకాడ హరిజనవాడకు చెందిన ఓం ప్రతాప్ గత నెలలో ఇంట్లో రాత్రి సమయంలో ఉరి వేసుకుని మరణించిన విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ మృతి కి సంభందించి టీడీపీ నేతలు అనేక ఆరోపణలు చేశారు. ఈ క్రమంలోనే ఓం ప్రతాప్ మృతిపై తగిన ఆధారాలు ఉంటే ఇవ్వాలని పోలీసులు చంద్రబాబు తో పాటు, ఎమ్మెల్సీ లోకేష్, వర్ల రామయ్యకి కూడా నోటీసులు పంపారు. వారం రోజుల్లోగా సమాధానం చెప్పాలని నోటీసుల్లో పేర్కొన్నారు.

Share