బ్రేకింగ్ –  “పవన్” కి తప్పిన పెను ప్రమాదం..

కాకినాడలో ప్రజా పోరాట యాత్రలో ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాన్ కు తృటిలో ప్రమాదం తప్పింది.ఆయన వాహనశ్రేణి లో ఓ వాహనాన్ని వేగంగా వస్తున్న లారీ ఢీకొట్టింది…దాంతో పవన్ కళ్యాణ్ కి ఏమన్నా అయ్యిందేమో నని ఒక్క సారిగా అందరూ కంగారు పడిపోయారు..అయితే ఎవరికీ ఈ ప్రమాదంలో ప్రాణాపాయం జరగక పోవడంతో ఊపిరి పీల్చుకున్నారు..వివరాలలోకి వెళ్తే..

Image result for pavan kalyan jansena

తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్న జనసేనాని  రాజానగరం బహిరంగ సభలో పాల్గొనేందుకు కాకినాడ నుంచి వెళ్తుండగా ఈ పెను ప్రమాదం జరిగింది…కంటి రెప్ప పాటులో జరిగిన ఈ ప్రమాదం అందరికి ఒక్క సారిగా షాక్ కి గురిచేసింది..అయితే వాహనం డీ కొట్టిన దానిలో పవన్ కళ్యాణ్ ప్రైవేట్ సెక్యూరిటీ  ప్రయాణిస్తున్నారు. వారికి తీవ్ర గాయాలయ్యాయి. వారందరిని దగ్గర్లోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు..ఎవరికీ ప్రాణాపాయం లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *