అందుకే పంచె కట్టా…

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్టామినా నిన్నటితో అందరికి తెలిసిందనే చెప్పాలి..పవన్ తలపెట్టిన జనసేన కవాతుతో ఏపీ ప్రభుత్వానికి గుండెలు దద్దరిల్లాయి..సభా స్థలికి వచ్చిన వారందరూ ఒక్క సారిగా అందరూ సీఎం..సీఎం అంటూ నినదించటంతో టీడీపీ నేతల గుండెల్లో రైళ్ళు పరిగెట్టాయని చెప్పాలి..అయితే పవన్ కళ్యాణ్ నిన్నటి రోజున కవాతు అశేష జన ప్రవాహం మధ్య చేయాల్సి ఉండగా అభిమాన తాకిడి ఎక్కువగా ఉండటంతో పోలీసు సూచన మేరకు కారుపైనే అభివాదం చేస్తూ ముందుకు కదిలారు..

Image result for janasena kawathu

అయితే ఈ సమయంలో పవన్ కళ్యాణ్ ధరించిన వస్త్ర ధారణ అందరిని ఆకట్టుకుంది. కొన్ని రోజుల నుంచీ పవన్ కళ్యాణ్ కొన్ని కొన్ని సందర్భాలో పంచె కట్టులో కనబటం చూస్తూనే ఉన్నాము..అయితే నిన్నటి రోజున పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ పంచెకట్టు లో ఉండటం తో అందరూ ఒకరినొకరు ప్రశ్నించుకున్నారు..దాంతో ఈ విషయం పవన్ దాకా వెళ్ళడంతో  కొందరు మీడియా మిత్రులు సైతం ఇది ఎన్నిక స్టంటా అని అడగటంతో పవన్ పంచెకట్టు పై వివరణ ఇచ్చారు..

Image result for janasena kawathu

పంచెకట్టు అనేది తెలుగుజాతి గుర్తు..తెలువాడికి ఇది ప్రతీక తెలుగుజాతికి అసలైన గుర్తు ఇదే..తెలుగువాడి ఆత్మాభిమానానికి ఈ పంచెకట్టు నిలువెత్తు నిదర్సనం నాకు రైతులని ఈ పంచెకట్టు లో చూస్తె ఎంతో ముచ్చట వేస్తుంది..అందుకే గోదావరి జిల్లాల పర్యటనలో పంచెకట్టు కట్టానని వివరణ ఇచ్చారు..అంతేకాదు నెలరోజుల పాటు తూర్పు గోదావరి జిల్లాలో ఉంటానని ఇక్కడి సంస్కృతీ సాంప్రదాయాలు తెలుసుకునే వరకూ ఇక్కడే ఉంటానని పవన్ తెలిపారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *