ఈ సినిమాతోనే పవన్ తనయుడు అకీరా ఎంట్రీ..!!!

పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా ని చూస్తే అచ్చం పవన్ కళ్యాణ్ లానే ఉంటాడు. ఫ్యాన్స్  అకీరాను చూసిన ప్రతీ సారి ఎప్పుడెప్పుడు మా బుల్లి బాస్ సినిమాలల్లో నటిస్తాడో అనుకునే వారు. కనీసం పవన్ నటించే సినిమాలో ఎదో ఒక రోల్ లో అకీరా కనిపిస్తాడని ఆశగా ఎదురు చూసేవారు ఫ్గ్యాన్స్. అయితే ఫ్యాన్స్ కు ఎప్పటికిఅప్పుడు నిరాశే ఎదురవుతోంది. కానీ తాజాగా పవన్ ఫ్యాన్స్ అందరూ ఎగిరిగంతేసేలా ఓ గుడ్ న్యూస్ మాత్రం టాలీవుడ్ వర్గాలలో వినిపిస్తోంది.

Image

పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా అడవి శేషు హీరోగా తెరకెక్కుతున్న మేజర్ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం కానున్నాడని తెలుస్తోంది.  అకీరా, అడవి శేషు కలిసి దిగిన ఓ ఫోటో వైరల్ అవడంతో అకీరా మేజర్ సినిమాలో అడవి శేషు చిన్ననాటి పాత్రలో నటిస్తున్నాడని, ఆ పాత్రకు ఎంతో పేరు రానుందని, కాబట్టే కావాలని అకీరాను ఈ పాత్రకు ఎంపిక చేశారనే వార్తలు మాత్రం చెక్కర్లు కొడుతున్నాయి.

Image

గూడచారి సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన యంగ్ దర్శకుడు తిక్కా శశి కిరణ్ మేజర్ సినిమాను కూడా డైరక్ట్ చేస్తున్నాడని తెలుస్తోంది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *