ప‌వ‌న్‌ను భ‌య‌పెడుతోన్న నంద్యాల‌… రీజ‌న్ ఇదే

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ 2019 ఎన్నిక‌ల్లో పోటీ అంటూ ప్ర‌క‌ట‌న‌లు చేస్తున్నాడే త‌ప్ప ఇప్ప‌టి వ‌ర‌కు ఏ ఎన్నిక‌ల్లోను పోటీ చేయ‌డం లేదు. వాస్త‌వంగా చెప్పాలంటే నంద్యాల్లో జనసేన పార్టీ పోటీ చేయాల్సింది. ఎందుకంటే.. అది ఒక రాజకీయ పార్టీ కాబట్టి. జ‌న‌సేన ఎప్పుడూ వ‌ర్కింగ్ కండీష‌న్‌లో ఉండ‌దు. ప‌వ‌న్ మీడియా ముందుకు వ‌చ్చి ప్రెస్‌మీట్ పెట్టి హ‌డావిడి చేసి వెళ్లిపోవ‌డం త‌ప్పా.
నంద్యాల‌లో పోటీ చేస్తే ప‌వ‌న్ స‌త్తా ఏంటో నిజంగానే తెలిసేది. అయితే ప‌వ‌న్‌కు ఇక్క‌డ త‌న‌కు అంత సీన్ లేద‌ని ముందుగానే అర్థ‌మైపోవ‌డంతో పోటీ చేయ‌కుండా చేతులు ఎత్తేశాడు. ఈ ఎన్నిక‌ల్లో ఎవ‌రికి మ‌ద్ద‌తు ఇచ్చేది రెండు రోజుల్లో చెపుతాన‌న్న ప‌వ‌న్ ఇప్ప‌టి వ‌ర‌కు ప‌త్తా లేకుండా పోయాడు.
ప‌వ‌న్ భూమాతో ప్ర‌జారాజ్యం పార్టీ నుంచి ఉన్న అనుబంధం నేప‌థ్యంలో టీడీపీకే మ‌ద్ద‌తు ఇస్తాడ‌ని అంద‌రూ అనుకున్నారు. అయితే ఇప్పుడు ప‌వ‌న్‌ను నంద్యాల గ్రౌండ్ రిపోర్టు భ‌య‌పెడుతోంద‌ట‌. అక్కడ తెలుగుదేశం పార్టీకి పరిణామాలు అంత సానుకూలంగా కనిపించడం లేదు. గెలుస్తుందో లేదో.. అనే డౌట్ ఉంద‌న్న నివేదిక‌లు ప‌వ‌న్‌కు చేర‌డంతో ప‌వ‌న్ టీడీపీకి మ‌ద్ద‌తు ఇచ్చే అంశంపై మౌనంగా ఉన్న‌ట్టు తెలుస్తోంది.
ఇప్ప‌టికే మంత్రి అఖిల ప‌వ‌న్ మ‌ద్ద‌తు త‌మ‌కే అని ప్ర‌చారం చేసుకుంటోంది. ప‌వ‌న్ ఇక్క‌డ టీడీపీకి ప్ర‌చారం చేసినా, మ‌ద్ద‌తు ఇచ్చినా ఫ‌లితం తేడా కొడితే అది మొద‌టికే మోస్తం వ‌స్తుంద‌ని, త‌న ప‌రువు పోతుంద‌న్న సందేహంతో ఉన్న ప‌వ‌న్ మౌనంగా ఉన్న‌ట్టు తెలుస్తోంది. నంద్యాల విషయంలో జోక్యం చేసుకోకుండా.. పరువును కాపాడుకోవడానికే పవన్  పరిమితం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయ‌న్న టాక్ ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లో వినిపిస్తోంది.
Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *