టీడీపీ ఎమ్మెల్యేకు ఘోర అవ‌మానం…

టీడీపి నాయకలు ఒకరి తరువాత మరొకరు  జనాగ్రహానికి బలై పోతున్నారు,వారి వారి దురుసు ప్రవర్తన కారణంగానో,నోటికి ఎదోస్తే అది మాట్లాడటం వలనో,మొత్తానికి ప్రజలు అడిగే ప్రశ్నలకి సమాధానాలు చెప్పలేక వారిని ఎలా సముదాయించాలో తెలియక ఇరకాటంలో పడి పరువు పోగొట్టుకుంటున్నారు.

 ఉదయగిరి తెలుగుదేశం పార్టీ ఏమ్మల్యే బొల్లినేని వెంకటరామారావు నియోజకవర్గ పరిధిలో జరిగిన పసుపు కుంభకోణం విషయం తెలిసిందే అయితే సూత్రదారుల మీద చర్యలు తీసుకోవడంలో సదరు ఏమ్మల్యే అడ్డుపడుతున్నారు అని అక్కడి రైతులు,ప్రజలు తీవ్రమైన అసంత్రుప్తిలో ఉన్నారు. ఇటీవల మండల పరిధిలోని జడదేవి గ్రామంలో జరుగుతున్న ఉత్సవాల్లో పాల్గొనేందుకు వెళ్లిన బొల్లినేని ఆలయంలోప్రత్యేక పూజల  నిర్వహించారు అనంతరం గ్రామంలోని ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అక్కడే ఉన్న కొంతమంది గ్రామస్థులు,రైతులు ఆయన్ని నిలువరించి ,గ్రామాభివృద్ధికి ఏలాంటి చర్యలు చేపట్టకుండా పసుపు కుంభకోణంలో అవినీతికి పాల్పడిన వారికి మద్దతు పలుకుతుండడం హేయమైన చర్య అని  ఆగ్రహం వ్యక్తం చేస్తూ అవినీతికి పాల్పడిన పార్టీ లోని కొందరి వ్యక్తులకి,బోల్లినేనికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
bollineni mla కోసం చిత్ర ఫలితం

    అక్కడే ఉన్న కొంతమంది నాయకులు వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేసినా వారు ఒప్పుకోలేదు దీంతో తీవ్ర అసహనానికి గురైన బొల్లినేని అక్కడనుండి వెళ్ళిపోయారు. అక్కడితో గొడవ అయిపోయింది అనుకున్న బొల్లినేని సోమవారం వరికుంటపాడులో జరిగిన పార్టీ మండల సర్వసభ్య సమావేశంలోనూ ఇదే గ్రామానికి చెందిన కార్యకర్తలు పసుపు కుంభకోణంలో అవినీతికి పాల్పడిన వారిని సస్పెండ్‌ చేయాలంటూ సభా వేదిక వద్ద కూడా నినాదాలు తో ఖంగుతిన్నారు. ఇలా బోల్లినేని ఎక్కడికి వెళ్ళినా రైతులు ఇదే విధంగా వ్యతిరేకిస్తూ నినాదాలు చేస్తూ తమ ఎమ్మల్యే మీద తమ వ్యతిరేకతను చాటుతున్నారు

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *