బీజేపీలోకి ఎన్టీఆర్‌…. చంద్ర‌బాబుకు పురందేశ్వ‌రి స్కెచ్‌..?

వ‌చ్చే ఎన్నిక‌ల్లో తెలుగు ప్ర‌జ‌ల దృష్టంతా ఏపీలో ఏం జ‌రుగుతుందా ? అన్న అంశంపైనే ఉంది. అస‌లు సిస‌లు మాజా అంతా ఇప్పుడు ఏపీ పాలిటిక్స్‌లోనే జ‌రుగుతోంది. తెలంగాణ‌లో వ‌చ్చే ఎన్నిక‌ల్లో వార్ వ‌న్‌సైడ్ అవుతుంద‌న్న చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. ఇటు ఏపీలో మాత్రం అధికార టీడీపీ, విప‌క్ష వైసీపీ మ‌ధ్య అధికారం కోసం పోరు జ‌రుగుతుంటే, గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీతో క‌లిసిన బీజేపీ, జ‌న‌సేన వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎటు వైపు ఉంటాయ‌న్న‌ది కూడా ఇప్పుడు ఇక్క‌డ పెద్ద ఆస‌క్తిగా మారింది.

బీజేపీ టీడీపీకి బ్రేక‌ప్ చెపుతుంద‌న్న నేప‌థ్యంలో చంద్ర‌బాబు ప‌వ‌న్‌ను ద‌గ్గ‌ర చేసుకునేందుకు దువ్వుకునే ప్ర‌య‌త్నాలు స్టార్ట్ చేసేశారు. 2019 ఎన్నిక‌ల్లో టీడీపీ+జ‌న‌సేన కలిసి పోటీ చేస్తాయ‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఇక ఎన్టీఆర్‌ను ద‌గ్గ‌ర చేసుకునే ప్ర‌య‌త్నాలు కూడా బాబు అండ్ లోకేశ్ స్టార్ట్ చేసేశార‌ట‌. అయితే గ‌త కొద్ది రోజులుగా ఎన్టీఆర్‌ను చంద్ర‌బాబు, బాలయ్య ఎలా దూరం పెట్టారో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.

ఇదిలా ఉంటే ఇప్పుడు ఎన్టీఆర్‌ను బీజేపీ వైపు మ‌ర‌ల్చేందుకు మేన‌త్త పురందేశ్వ‌రి ప్ర‌య‌త్నాలు ప్రారంభించిన‌ట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్‌ను మ‌ళ్లీ చంద్ర‌బాబు అండ్ గ్యాంగ్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో వాడుకుని మ‌ళ్లీ ప‌క్కన పెడ‌తార‌ని, అలా కాకుండా బీజేపీలో వ‌స్తే ఫ్యూచ‌ర్ ఉంటుంద‌ని పురందేశ్వ‌రి ఎన్టీఆర్‌కు న‌చ్చ‌చెప్పే ప్ర‌య‌త్నాలు కూడా స్టార్ట్ చేసిన‌ట్టు తెలుస్తోంది.

బీజేపీలోకి ఎన్టీఆర్ వెళితే ప్ర‌స్తుతం ఆమె ఏపీ బీజేపీ ప‌గ్గాల‌ను త‌న చేతుల్లో పెట్టుకోవ‌డంతో పాటు త‌ర్వాత ఎన్టీఆర్‌కు ఏపీ బీజేపీలో స‌రైన ఫౌండేష‌న్ వేసేందుకు ఆమె మాస్ట‌ర్ ప్లాన్ వేసిన‌ట్టు తెలుస్తోంది. పురందేశ్వ‌రి ప‌దే ప‌దే ఒత్తిడి చేయ‌డంతో ఎన్టీఆర్ చంద్ర‌బాబు చెంత మ‌రోసారి చేరేందుకు సిద్ధంగా లేర‌న్న టాక్ మాత్రం న‌డుస్తోంది. అందుకే ఎన్టీఆర్‌ను త‌మ వైపున‌కు తిప్పుకునే క్ర‌మంలోనే తాజాజా లోకేశ్ కూడా ఎన్టీఆర్‌కు త‌న‌కు విబేధాలు లేవ‌ని చెప్పిన‌ట్టు కూడా తెలుస్తోంది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *