పుష్ప -2 రిలీజ్ మాటేమో కానీ “బన్నీ పింక్ గోరు” కధేంటో తెలుసా…??

స్టైల్ స్టార్ అల్లూ అర్జున్ కు ప్రపంచ వ్యాప్తంగా  ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందన్న విషయం అందరికి తెలిసిందే అయితే పుష్పా సినిమా తరువాత ఈ ఫ్యాన్స్ బేస్ మరింత పెరిగింది. పుష్ప మొదటి భాగం బాక్సాఫీస్ ను షేక్ చేసిన తరువాత పుష్ప -2 పై భారీ అంచనాలు పెరిగిపోయాయి. ఈ క్రమంలోనే జాతీయ ఉత్తమ నటుడు అవార్డ్ గెలుచుకోవడంతో పుష్ప -2 పై అంచనాలు మించిపోయాయి. ఈ క్రమంలోనే

Pushpa 2: The Rule OTT Release Date | These Two OTT Platforms Are Competing  For Film's Post-Theatrical Streaming Rights

పుష్ప -2 సినిమా రిలీజ్ డేట్ ను చిత్ర యూనిట్ ప్రకటించింది. వచ్చే ఏడాది 2024 ఆగస్ట్ 15 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుందని చెప్పేసింది. ఈ ప్రకటన చేసిన సమయంలో ఓ పోస్టర్ ను సైతం రిలీజ్ చేసింది చిత్ర యూనిట్ ఈ పోస్టర్ లో అల్లూ అర్జున్ చాలా డిఫరెంట్ గా కనపడుతున్నారు. ముఖ్యంగా ఈ పోస్టర్ లో అల్లూ అర్జున్ చేతిని హైలెట్ చేస్తూ ఉండటంతో సర్వత్రా ఆసక్తిగా మారింది. ఇప్పుడు ఫ్యాన్స్ అందరూ రిలీజ్ డేట్ పక్కన పెట్టి ఈ పోస్టర్ లో బన్నీ చేతి గోరు పై చర్చ మొదలు పెట్టారు.

Pushpa 2 release date out.

స్టైల్ గా కూర్చుని ఉన్న   ఈ ఫోటోలో బన్నీ రెండు చేతులో హైలెట్ గా చూపించారు. రెండు చేతులకు ఉంగరాలు,బ్రాసిలెట్ ముఖ్యంగా ఎడమ చేతి చిటికిన వేలుకు ఉన్న పింక్ కలర్ ను హైలెట్ చేసి చూపించారు. ఈ చిటికిన వేలు గోరు పొడవుగా ఉండటం పై అర్థం పరమార్ధం ఏంటో అనుకునేట్టుగా ఆసక్తిని కలిగించారు. అంతేకాదు గతంలో విడుదల చేసిన టీజర్ లో సైతం ఈ గోరును హైలెట్ చేసి చూపడం ఇప్పుడు కూడా ఇదో గోరును హైలెట్ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేయడంతో ఫ్యాన్స్ కన్యూజన్ లో పడ్డారు మొత్తానికి ఈ గోరు కధ తెలియాలంటే వచ్చే ఏడాది ఆగస్ట్ 15 వరకూ ఆగాల్సిందే…

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *