నంద్యాలలో “గెలుపు” వైసీపీదే

 నంద్యాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ కి  తిరుగులేదని, ఆ పార్టీ ఘన విజయం సాధించడం ఖాయమని   క్వెస్ట్ ఏజెన్సీ ఎగ్జిట్ పోల్ ప్రకటించింది. ఇప్పటి వరకు చాలా ఎగ్జిట్ పోల్స్ అనేక సర్వేలు చేపట్టిన విషయం తెలిసిందే.వీటిలో కొన్ని రెండు పార్టీలకు సానుకూలంగా మరికొన్ని వ్యతిరేకంగా రిజల్ట్స్ ఇచ్చాయి. ఇలా పరస్పరం భిన్నమైన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నాయి ఎగ్జిట్ పోల్స్. ఈ నేపథ్యంలో క్వెస్ట్ ఎగ్జిట్ పోల్ ఆసక్తిని రేకెత్తిస్తోంది.

క్వెస్ట్ ఎగ్జిట్ పోల్ నంద్యాల ప్రజల నాడి పట్టడంలో చలా గ్రౌండ్ వర్క్ చేసింది.దీనికోసం చాలా టీమ్స్,గ్రామా గ్రామాలలో తిరిగి ప్రజాభిప్రాయం తెలుసుకుని తమదైన శైలిలో రిపోర్ట్ ని సేకరించాయి. నంద్యాల్లో వైకాపా కనీసం 56 శాతం ఓట్లను సాధించుకుంటుందని. మొత్తం పోలైన ఓట్లలో ఈ శాతం ఓట్లు వైకాపా సొంతం చేసుకుంటుందని ఈ అధ్యయనం తేల్చింది. ఇక తెలుగుదేశం పార్టీ 38 శాతం ఓట్లకు పరిమితం అవుతుందని.. ఓవరాల్ 18 శాతం ఓట్ల మెజారిటీతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ఈ సర్వే తేల్చింది. ఇక నంద్యాల్లో మైనారిటీ అభ్యర్థిని బరిలో దించిన కాంగ్రెస్ పార్టీ 4.9 శాతం ఓట్లను పొందుతుందని తెలియచేసింది.

nandhyala jagan road show కోసం చిత్ర ఫలితం

మొత్తం 97,933 ఓట్లను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పొందే అవకాశం ఉందని ఈ అధ్యయనం తేల్చింది.టీడీపీకి 66,906 ఓట్లు పొందుతందట. దీన్ని బట్టి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ముప్పై వేలకు పైగా మెజారిటీ వచ్చే అవకాశం ఉందని ఈ అధ్యయనం తేల్చి చెప్పింది.తమ అంచానాలు దాటి కొంచం అటు ఇటుగా మార్పులు జరగచ్చు ఏమో కానీ,నంద్యాల ఓటర్లు మాత్రం వైకాపాకి విజయం అందించడం లో సందేహం లేదు అని తేల్చి చెప్పేశారు.

 

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *