రివ్యూ – నేనే రాజు నేనే మంత్రి…

సమర్పణ- డి.రామానాయుడు

నిర్మాణ సంస్థలు:- సురేష్‌ ప్రొడక్షన్స్‌, బ్లూ పానెట్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌

నటీనటులు- రానా, కాజల్‌, కేథరిన్‌, అశుతోష్‌ రాణా, పోసాని కృష్ణమురళి, అజయ్‌, నవదీప్‌, జోష్‌ రవి, తనికెళ్లభరణి, జయప్రకాష్‌ రెడ్డి తదితరులు

సంగీతం- అనూప్‌ రూబెన్స్‌

సినిమాటోగ్రఫీ-వెంకట్‌ సి.దిలీప్‌

నిర్మాతలు- డి.సురేష్‌బాబు, కిరణ్‌రెడ్డి, భరత్‌ చౌదరి

కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం- తేజ

అతి తక్కువ సినిమాలు చేసి మంచి విలక్షణమైన నటుడిగా విజయాలతో దూసుకుపోతున్న రానా దగ్గుబాటి బాహుబలి తరువాత ఏ సినిమా చేస్తాడా అని తన అభిమానులు సగటు ప్రేక్షకులు ఎదురుచూస్తుంటే,ఎప్పుడో చిత్రం ,నువ్వు నేను,జయం లాంటి హిట్ సినిమాలు తీసి తరువాత వరుస పరాజయాలతో ఇండస్ట్రీ కి దూరం అయ్యిన దర్శకుడు తేజా తో రానా సినిమా చేయడం నిజంగా సాహసమే. తేజా దర్శకత్వంలో రానా నటించిన చిత్రమే ‘నేనే రాజు నేనే మంత్రి’. ఈ సినిమాలోని పొలిటికల్‌ డైలాగ్స్‌, రానా నటన సినిమాపై మంచి అంచనాలే పెంచాయి. ఈ సినిమా ప్రేక్షకులకి రీచ్ అయ్యిందా లేదా అనేది ఇప్పుడు చూద్దాం

కథ:

  నేనే రాజు నేనే మంత్రి లో  జోగేంద్ర ,రాధలు  (రానా,కాజల్) భార్యభర్తలు. ఒకరంటే ఒకరికి ప్రాణం జోగేంద్ర తన గ్రామంలో  ధర్మ వడ్డీలకు డబ్బులు ఇస్తుంటాడు. పెళ్ళైన మూడేళ్లకి రాధ  గర్భవతి అవుతుంది. మొక్కుతీర్చుకోవడానికి వెళ్ళిన రాధ ని  గుడి మెట్లమీద నుండీ కిందకి తోసేస్తుంది ఆ వురి సర్పంచ్(ప్రదీప్ రావత్ ) భార్య ,దీంతో రాధకి గర్భం పోతుంది.ఎ=సర్పంచి అంటే ఎంతో కోపంగా ఉండే రాధ జోగేంద్రని ఎలాగ అయిన సర్పంచి అవ్వమని అడుగుతుంది  భార్య అంటే ఇష్టముండే జోగేంద్ర తన తెలివి తేటలతో సర్పంచ్‌ అవుతాడు. తన పదవి పోవడంతో మాజీ సర్పంచ్‌, జోగిని హత్య చేయాలని చూస్తే, జోగియే మాజీ సర్పంచ్‌ను చంపేస్తాడు. జోగేంద్ర పదవి, డబ్బు, ప్రజల్లో అతనికున్న పలుకుబడిని చూసి ఎమ్మెల్యే చౌడప్ప(సత్య ప్రకాష్‌) అతన్ని పోలీసు కేసు నుండి తప్పిస్తాడు. ఈ కేసులో ఎమ్మెల్యేకు సి.ఐ(అజయ్‌) సహాయపడతాడు. చివరకు అజయ్‌, ఎమ్మెల్యేలు జోగిని డబ్బులు అడుగుతారు. జోగి తన తెలివితో సిఐని ట్రాన్స్‌ఫర్‌ చేయిస్తాడు. ఎమ్మెల్యేను చంపేసి ఎమ్మెల్యే అవుతాడు. అక్కడ నుండి జోగేంద్ర రాజకీయ చదరంగం ఆడటం మొదలు పెడతాడు. జోగేంద్రకు శివ(నవదీప్‌) కుడిభుజంలా అండగా నిలబడతాడు. రాజకీయ ప్రత్యర్థులు ఆడే ఆటలో నిజానిజాలు తెలియకుండా శివను జోగేంద్ర చంపేస్తాడు. ఎలాగైనా సీఎం కావాలని జోగేంద్ర కలలు కంటాడు.అప్పటినుండి రాజకీయ ఎత్తులు పై ఎత్తులు వేస్తూ ఉంటాడు జోగి ఈ ఆటలో జోగీంద్ర విజయం సాధిస్తాడా ? ఎవరిదీ గెలుపు ? అనేది తెరమీద చూడాల్సిందే

 సంబంధిత చిత్రం

విశ్లేషణ:

సినిమా అంతా జోగేంద్ర (రానా ),కాజల్ (రాధ) చుట్టే సాగుతుంది ఎవరికీ తగ్గ పాత్రలలో వారు ఒదిగిపోయారు బాహుబలి తరువాత రానా చేసిన పొలిటికల్ గేమ్ సినిమా ఇది ఐతే ఇంతకముందు రానా లీడర్ సినిమాలో ఇదే తరహా పాత్రనే చేసినా అందులో చాలా సైలెంట్ క్లాస్ యాంగిల్ లో సినిమా సాగిపోతుంది కానీ రానా ఈ సినిమాలో మాస్ లుక్ తో సామాన్య వడ్డీ వ్యాపారి సీఎం కావాలనుకున్నప్పుడు అతను ఎదిగే క్రమం, అందులో అతను ఎదుర్కొనే సమస్యలు అన్నింటినీ చక్కగా చూపించారు. రానా తన పాత్రకు తగిన విధంగా బాడీ లాంగ్వేజ్‌ను మార్చుకుని చేసిన సినిమా ఇది. రానా లుక్‌ కూడా ఆకట్టుకుంటుంది. ప్రీ క్లైమాక్స్‌లో హాస్పిటల్‌ సీన్‌లో కాజల్‌ నటన మెప్పిస్తుంది. ఇక నవదీప్‌ కీలక పాత్రలో తన పాత్రకు న్యాయం చేశాడు. ఫస్టాఫ్‌ వరకే నవదీప్‌ పాత్ర పరిమితమైంది. విలన్‌ పాత్రలో అశుతోష్‌ రానా మెప్పించాడు ఇక పోసాని కృష్ణమురళి తనదైన శైలిలో సెటైరికల్‌ డైలాగ్స్‌తో ప్రేక్షకులను నవ్వించాడు. వాడు జోగేంద్ర..అంటూ డైలాగ్‌ చెబుతూ మరోవైపు ప్రభాస్‌ శ్రీను నవ్వించాడు. దూరదర్శన్‌ కెమెరామెన్‌గా బిత్తిరి సత్తి తనదైన యాసతో, మరోవైపు సెంట్రల్‌ జైలు సూపరిడెంట్‌ పాత్రలో జయప్రకాష్‌ రెడ్డిలు అలరించారు ఇక సాంకేతిక విషయాలకు వస్తే, దర్శకుడు తేజ ఇప్పటి వరకు లవ్‌స్టోరీతోనే పెద్ద విజయాలను సాధించాడు. ఈసారి తన ట్రెండ్‌కు భిన్నంగా చేసిన సినిమా ఇది. పొలిటికల్‌ బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుంది. ఐదేళ్ల కాలంలో ఓ వ్యక్తి ప్రయాణాన్ని తేజ తెరకెక్కించే ప్రయత్నమే ఈ చిత్రం. స్క్రీన్‌ప్లే పరంగా క్లారిటీతో సినిమా సాగుతుంది. అనూప్‌ నువ్వే నువ్వే సాంగ్‌, జోగేంద్ర టైటిల్‌ సాంగ్‌ ఇలా అన్ని మాంటేజ్‌ సాంగ్స్‌ ఒకే అనిపించాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ప‌రావాలేదు. వెంకట్‌ సి.దిలీప్‌ సినిమాటోగ్రఫీ బావుంది. లక్ష్మీభూపాల్‌ మాటలు సినిమాకు ప్లస్‌ అయ్యాయి. రానా సందర్భానుసారం చెప్పే సామెతలు. పొలిటికల్ సెటైర్ లు, వంద మంది ఎమ్మెల్యేలను తీసుకెళ్లి హోటల్‌లో పెడితే నేను అవుతాను సీఎం… ఇలాంటి డైలాగ్స్‌తో పాటు క్ల్రైమాక్స్‌లో జనం ఎవరికి ఓటేస్తుంటారు. ఎలా మోసపోతుంటారు. ప్రజల గురించి చాలా మంది రాజకీయ నాయకులు ఎలా ఆలోచిస్తారు. అసలు సానుభూతి ఓట్లు వేయడం, వారసత్వ రాజకీయాలు మీద ఇలా అన్నింటిపై వచ్చే డైలాగ్స్‌ ప్రేక్షకులను మెప్పిస్తాయి. ఒక రకంగా చెప్పాలి అంటే ఇప్పటి రాజకీయ నాయకులలో కొంతమందికి ఈ డైలాగ్స్ వింటే ఎక్కడో టచ్ చేసినట్టుగా ఉంటుంది.

రేటింగ్‌ – 2.5 

 

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *