రివ్యూ – వివేకం

టైటిల్: వివేకం
జానర్: స్పైథ్రిల్లర్
తారాగణం: అజిత్ కుమార్, వివేక్ ఒబరాయ్, కాజల్ అగర్వాల్, అక్షర హాసన్
సంగీతం: అనిరుధ్
దర్శకత్వం: శివ
నిర్మాత: సెంథిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ హీరోగా తెరకెక్కిన భారీ యాక్షన్ థ్రిల్లర్ వివేకం. వీరం, వేదలం లాంటి భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ లు అందించిన అజిత్, శివ కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ సినిమా కావటంతో తమిళ మరియు తెలుగు లో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా కావటంతో ఈ మూవీపై భారీ హైప్ క్రియేట్ అయ్యింది. స్పై థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఎంత వరకు ఆకట్టుకుంది.? చూద్దాం.

కథ :
అజయ్ కుమార్ (అజిత్ కుమార్) కౌంటర్ టెర్రరిస్ట్ స్క్వాడ్ లో పని చేస్తుంటాడు. తన నలుగురు స్నేహితులతో కలిసి 279 మిషన్ లను సమర్థవంతంగా పూర్తి చేసిన అజయ్, 280వ మిషన్ లో ఉండగా అదృశ్యమవుతాడు. కొంత కాలం తరువాత భారీ వినాశనానికి ప్రయత్నించిన ఓ అంతర్జాతీయ మూఠా ను మట్టుబెట్టిన సమయంలో అజయ్ ఉనికి వెలుగులోకి వస్తుంది. దీంతో ఎలర్ట్ అయిన కౌంటర్ టెర్రరిస్ట్ స్క్వాడ్ టీం అజయ్ కోసం వెతకటం ప్రారంభిస్తుంది. అందుకోసం అజయ్ స్నేహితుల సాయం తీసుకుంటుంది.

vivekam telugu poster కోసం చిత్ర ఫలితం

తన భార్యతో కలిసి ఓ హోటల్ నడుపుతున్న ప్రశాంతంగా జీవిస్తున్న అజయ్.. సీక్రెట్ గా తన మిషన్ ను కొనసాగిస్తుంటాడు. ప్రపంచ వ్యాప్తంగా కృతిమ భూకంపాలను సృష్టించి భారీ ప్రాణ ఆస్తి నష్టాలను సృష్టించేందుకు అంతర్జాతీయ తీవ్రవాదులు ప్లాన్ చేస్తారు. అందుకోసం ప్లుటోనియం ఆయుధాలను శాటిలైట్ సాయంతో పేల్చేసేందుకు ప్లాన్ చేస్తారు.  ఈ ఆయుదాలను పేల్చాలనుకుంటుంది ఎవరు..? ఆ ప్రయత్నాలను అజయ్ కుమార్ ఎలా అడ్డుకున్నాడు..? అసలు అజయ్ రహస్య జీవితం ఎందుకు గడుపుతున్నాడు..? అన్నదే మిగతా కథ.

నటీనటులు :
ఈ సినిమా అంతా అజిత్ నటనమీద,తన ఇమేజ్ మీదనే ఆదారపడింది.యాక్షన్, ఎమోషన్, స్టైల్ ఇలా అన్ని ఎలిమెంట్స్ ను సమపాళ్లలో అందించి అభిమానులను అలరించాడు. హీరోయిన్ గా కాజల్ ఆకట్టుకుంది. గ్లామరస్ గా ఈ మూవీ లో కనిపించకపోయినా పాత్రకి పూర్తి  న్యాయం చేసింది. తెరమీద కనిపించింది కొద్ది సేపు అయినా అక్షరా హాసన్ తన టాలెంట్ ప్రూవ్ చేసుకుంది . క్రిష్ లోని విలన్ పాత్రలో నటించింది వివేక్ ఒబెరాయ్ మల్లి క్రిష్ ని గుర్తు చేసేలా నటించాడు కానీ పెద్దగా ఆశించినంత గా మెప్పించలేకపోయాడు.

సాంకేతిక నిపుణులు :
సినిమా ఆధ్యాంతం ఒక హాలివుడ్ సినిమా చూసిన అనుభూతి కలుగుతుంది. అంతర్జాతీయ స్థాయిలో సినిమా ని చూపించడంలో దర్శకుడు శివ సక్సెస్ అయ్యాడు. కానీ లోకల్ ప్రేక్షకులు కి సినిమాని చేరువ చేసే విషయంలో మాత్రం విఫలం అయ్యాడు.సినిమాలో మాస్ మసాలా ఉండదు. హాలివుడ్ సినిమాలని ఫాల్లో అయ్యే వారికి ఈ సినిమా నచ్చుతుంది . ముఖ్యంగా చేజింగ్, యాక్షన్ ఎపిసోడ్స్ లో అనిరుథ్ మ్యూజిక్ ఆడియన్స్ ను కట్టిపడేస్తుంది. వెట్రీ సినిమాటోగ్రఫి సినిమాకు మరో ఎసెట్. సత్య జ్యోతి ఫిలింస్ నిర్మాణ విలువలు హాలీవుడ్ స్థాయి సినిమాను దక్షిణాది ప్రేక్షకులకు ముందుకు తీసుకువచ్చాయి.

ప్లస్ పాయింట్స్ :

బ్యాక్ గ్రౌండ్ స్కోర్
యాక్షన్ సీన్స్
అజిత్ నటన
గ్రాండ్ విజువల్స్

మైనస్ పాయింట్స్ :

పాటలు,

కధ 

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *