యూట్యుబ్ లో రికార్డ్ లు క్రియేట్ చేస్తున్న “సర్కార్”

తమిళ నాట హీరో విజయ్ కి ఉన్న ఫాలోయింగ్  అంతాఇంతా కాదు..విజయ్ తీసిన ఎన్నో సినిమాలు తెలుగులో రీమేక్ అయ్యి సంచలనం సృష్టించాయి.అయితే ఇప్పుడు కోలివుడ్ ప్రేక్షకులు అందరూ ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్న సినిమా సర్కార్. మురుగ దాస్ –విజయ్ కాంబో లో వస్తున్న ఈ సినిమా తాలూకు టీజర్ ని తాజాగా విడుదల చేశారు నిన్న సాయంత్రం 6 గంటల ప్రాంతంలో విడుదలైన ఈ టీజర్ ఇప్పుడు యూట్యూబ్ లో రికార్డులు సృష్టిస్తోంది.

Image result for sarkar movie images

టీజర్ విడుదలైన పది నిమిషాల్లోనే మిలియన్ వ్యూస్ దాటేసి ఆశ్చర్యపరిచింది. ఒక్క గంటలోనే ఈ టీజర్ 4 మిలియన్ వ్యూస్ దాటేసింది…ఇప్పటివరకు ఈ సినిమాకి 13 మిలియన్ వ్యూస్ రావడం విశేషం. ఇంతవేగంగా రికార్డులు సృష్టించిన ఘనత ‘సర్కార్’ టీజర్ కే సొంతం. అయితే ఈ సినిమాలో సంపన్నుడైన హీరో తన ఓటు హక్కుని వినియోగించుకోవడం కోసం ఇండియాకి వస్తాడు.ఈ క్రమంలో జరిగే పరిణామాల నేపధ్యంలో ఈ సినిమా సాగనుంది…భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కిన సినిమా ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తుందో వేచి చూడాలి.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *