రివ్యూ – “సవ్యసాచి”

సినిమా పేరు – సవ్యసాచి

తారాగణం –  అక్కినేని నాగచైతన్య, నిధి అగర్వాల్, మాధవన్, భూమికా చావ్లా తదితరులు

దర్శకత్వం – చందూ ముండేటి

నిర్మాతలు – మైత్రి మూవీ మేకర్స్

సంగీతం ఎం.ఎం.కీరవాణి

సినిమాటోగ్రఫీ –  యువరాజ్
అక్కినేని ఫ్యామిలీ నుంచీ నాగార్జున వారసుడిగా చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టిన చైతు మొదటి సినిమా హిట్ కాకపోయినా మెల్ల మెల్లగా పుంజుకుంటూ వచ్చాడు..చైతూకి బ్లాక్ బ్లాస్టర్ హిట్స్ లేకపోయినా సరే తనకి ఉన్న డిఫరెంట్ క్రేజ్ తో సినిమాలు నడిపిస్తున్నాడు.. దీంతో చైతూ నటించిన లేటెస్ట్ మూవీ సవ్యసాచిపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో కూడా మంచి అంచనాలు ఏర్పడ్డాయి. చందూ ముండేటి డైరెక్ట్ చేసిన ఈ సినిమా తో చైతూ సక్సెస్ సాధించాడా లేదా అనేది చూద్దాం..

Image result for savyasachi poster

కథ:
విక్రమ్ ఆదిత్య(నాగ చైతన్య) ట్విన్ వానిషింగ్ సిండ్రోమ్ ఒక జబ్బుతో బాధపడుతుంటాడు. అతడు తన అక్క(భూమికా చావ్లా)తో ఉంటుంటాడు. ఈ క్రమంలో కాలేజీలో చదుకునే చిత్ర(నిధి అగర్వాల్)ను చూసి ప్రేమిస్తాడు ఆదిత్య. కట్ చేస్తే.. ఆదిత్య మేనకోడలు కిడ్నాప్‌కు గురవుతుంది. ఈ కిడ్నాప్ చేసింది ఎవరు అనే మిస్టరీని చేధించే పనిలో ఆదిత్య ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు? ఈ కిడ్నాప్‌ను ఎవరు, ఎందుకు చేశారు? ఆదిత్యతో వారికి ఉన్న సంబంధం ఏమిటి అనేది సినిమా కథ.

 

విశ్లేషణ:

సవ్యసాచి సినిమాను ఎంతో ఇంట్రెస్టింగ్‌గా తెరకెక్కించాడు దర్శకుడు చందూ. నాగచైతన్య కెరీర్‌లో చేసిన బెస్ట్ చిత్రాల్లో ఇది కూడా ఒకటి అని చెప్పాలి..ఈ సినిమాలో సస్పెన్స్ ని ఒక హైలేవిల్ లో తీసుకువెళ్ళవచ్చు కానీ దర్శకుడు సస్పెన్స్ క్రియేట్ చేయడంలో సక్సెస్ అవ్వలేకపోయాడనే చెప్పాలి.. ఒక మామూలు కమర్షియల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా మాత్రమే దీన్ని ప్రెజెంట్ చేయడానికి దర్శకుడు ప్రయత్నించాడు.

ఇక కథాకథనం విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్‌లో హీరో ఇంట్రొడక్షన్, హీరోయిన్‌తో లవ్ ట్రాక్, తన స్నేహితులతో జరిగే సీన్స్‌తో కాస్త పర్వాలేదనిపించింది. అయితే ఇంట్రెస్ట్ క్రియేట్ చేసే అంశాలు మాత్రం ఎక్కడా కనిపించలేదు. ఇంటర్వెల్ బ్యాంగ్‌ ఎపిసోడ్‌లో వచ్చే ట్విస్ట్ బాగుంది. సెకండాఫ్‌లో హీరో-విలన్‌ల మధ్య మైండ్ గేమ్‌ అంశాన్ని పెద్దగా వాడుకోలకపోయారు చిత్ర యూనిట్. దీంతో ప్రేక్షకుడిలో క్యూరియాసిటీని క్రియేట్ చేయడంలో సవ్యసాచి విజయం సాధించలేకపోయింది. ప్రీ-క్లైమాక్స్‌, క్లైమాక్స్‌లో పెద్దగా పస లేకపోవడంతో సినిమా అయిపోయిందని రిలీఫ్ ఫీల్ అయ్యారు ఆడియెన్స్…ఎం.ఎం.కీరవాణి అందించిన సంగీతం సినిమాకు కొంతమేర బాగా ఉపయోగపడింది. ముఖ్యంగా రీ-రికార్డింగ్ అద్భుతంగా వచ్చింది…అయితే చాలా కాలం తరువాత కీరవాణి పాటలు వచ్చినా సరే కొత్తదనం మాత్రం చూపించలేక పోయాడు కీరవాణి.

 

నటీనటుల పర్ఫార్మెన్స్:

ముందుగా హీరో చైతూ మాట్లాడుకోవాలి..తనదైన శైలికి భిన్నంగా ఈ సినిమాలో చైతు నటించాడు..గత సినిమాలలో పోల్చితే ఈ సినిమాలో మరింత మెచ్యూరిటీ నటన ప్రదర్శించాడు చైతు.. ఇక ఈ సినిమాకు అసలుసిసలు ప్లస్ పాయింట్ ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా మాధవన్ అనే చెప్పాలి. హీరోగా మనకు మాధవన్ సుపరిచితుడే. కానీ తొలిసారి తెలుగులో విలన్ పాత్రలో చెలరేగిపోయాడు. అతడి యాక్టింగ్ లెవెల్స్‌కు ఆడియెన్స్ ఇంప్రెస్ అవుతారు. సినిమాలో వెన్నెల కిషోర్‌తో పాటు చాలా మంది కమెడియన్లు ఉన్నా పెద్దగా నవ్వించలేకపోయారు. భూమిక తన పాత్రమేర బాగానే చేసింది. హీరోయిన్ నిధి అగర్వాల్‌ ఓకే. మిగతా వారు తమ పాత్రలకు చేయాల్సిన న్యాయం చేశారు.

 

చివరగా చెప్పాలంటే :
సవ్యసాచి – ఫరవాలేదని అనిపించాడు.

రేటింగ్: 2.5/5

 

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *