“సైరా”లో….”పవన్ కళ్యాణ్”… కీలక పాత్ర..

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక పక్క రాజకీయాల్లో బిజీ బిజీగా ఉంటూనే మరో పక్క తన సినిమా రంగాన్ని వదలడంలేదు..సినిమాల్లో నటించడం ఒక్కటే లేదు మిగతాది అంతా సేం తో సేం అంటున్నాడట..అందుకే తనని ఎవరైనా ఆడియో ఫంక్షన్ కి పిలిచినా లేదా ఏదన్నా సినిమా వేడుకకి ఎవరు పిలిచినా కాదని చెప్పకుండా వెళ్లిపోతున్నాడట..అయితే పవన్ కళ్యాణ్ తన అన్నయ్య పుట్టిన రోజు అయిన సెప్టెంబర్ 22 న స్వయంగా తన భార్యతో సహా వెళ్లి శుభాకాంక్షలు తెలిపాడు..అయితే

Image result for pavan kalyan sayera sets

చిరంజీవి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటిస్తున్న చిత్రం సైరా నరసింహారెడ్డి ఈ సినిమాని చిరు తనయుడు మెగా పవర్ స్టార్ నిర్మిస్తుండగా ఎంతో మంది అతిరధ మహారధులు కూడా ఈ సినిమాలో నటించడం ఎంతో గొప్ప విషయం అయితే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కూడా నటిస్తున్నాడు అనే వార్త ఇప్పుడు టాలీవుడ్ ని షేక్ చేస్తోంది…అంతేకాదు పవన్ కళ్యాణ్ ఎలాంటి పాత్రలో కనిపిస్తారు అంటూ అప్పుడే ఊహాగానాలు మొదలయ్యాయి.

Image result for sye raa narasimha reddy

అయితే ఈ వార్తలు నిజం చేసే విధంగా పవన్ తాజాగా సైరా నరసింహారెడ్డి సెట్లో కనిపించి మెగా అభిమానులను ఆశ్చర్యంలో ముంచెత్తారు…అమితాబ్ ,చిరు, పవన్ కళ్యాణ్, చెర్రీ కలిసి దిగిన ఫోటో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది ఇదిలాఉంటే..ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కేవలం 5 నిమిషాలు నిడివి ఉన్న పాత్రలో నటిస్తున్నారని అంతేకాదు ఈ పాత్ర ఉన్నంతసేపు రోమాలు నిక్కపోడుచుకునే విధంగా సన్నివేశాలు , డైలాగులు ఉంటాయనే టాక్ ఇప్పుడు పవన్ అభిమానులని ఆనందంలో ముంచెత్తుతోంది…ఈ వార్తల్లో నిజం ఎంత ఉందొ తెలియదు కానీ మొత్తానికి పవన్ సైరా లో నటిస్తున్నాడు అనే వార్తతో మెగా అభిమానులు సంబరపడిపోతున్నారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *