ర‌వితేజ‌కు డ్ర‌గ్స్ ఇచ్చింది వాళ్లేనా…

టాలీవుడ్ మాస్ మ‌హ‌రాజ్ ర‌వితేజ రేపు సిట్ ముందు విచార‌ణ‌కు రాబోతున్నాడు. తొలి విడ‌తో సిట్ నోటీసులు జారీ చేసిన 12 మంది ప్ర‌ముఖుల్లో ఇప్ప‌టికే సిట్ 8 మందిని విచారించింది. ఇక రేపు శుక్ర‌వారం తొమ్మిదో వ్య‌క్తిగా ర‌వితేజ‌ను విచారించ‌నుంది. ఇక రవితేజ‌ను విచారించేముందు సిట్ చేతుల్లో ఆయ‌న‌కు సంబంధించి కీల‌క ఆధారాలు ల‌భ్య‌మైన‌ట్టు తెలుస్తోంది.
రవితేజాకు జీశ్యామ్‌తో ఎక్కువగా లింకులు ఉన్నాయని ఆయన ద్వారా రవి డ్రగ్స్ తెప్పించుకునేవారని, నేరుగా డబ్బులు చెల్లించేవారని సమాచారం. అరస్టయిన జీశ్యామ్‌ విచారణలో ఇచ్చిన ఆధారంగానే రవితేజకు అధికారులు నోటీసీలు జారీ చేసినట్లుగా తెలుస్తోంది.
శుక్రవారం విచార‌ణ అంతా ర‌వితేజ‌- జీ శ్యామ్ లింకుల గురించే ఉండ‌నుంద‌ని తెలుస్తోంది. రవితేజకు నేరుగా డ్రగ్స్ ముఠాలతో సంబంధాలు ఉన్నాయా ? లేవా? అన్నది ఒక కోణం. రవితేజ విచారణ ముగిసిన తర్వాత మరో హీరో తనిష్, నందు, రవితేజ కారు డ్రైవర్ శ్రీనివాస రాజును కూడా సిట్ అధికారులు విచారించనున్న‌ట్టు తెలుస్తోంది.
ఇప్పటికే డ్రగ్స్ కేసులో అధికారులు విచారించిన వారి సంఖ్య 34కు చేరింది. అందులో 8 మంది సినీ రంగానికి చెందినవారున్నారు. ఇక రవితేజకు డ్రగ్స్‌కు సంబంధించి కెల్విన్‌తో సంబంధాలు ఉన్నట్లు సిట్ అధికారుల వద్ద ఆధారాలు ఉన్నట్లు సమాచారం.
Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *