వైసీపీలోకి ఆరుగురు టీడీపీ ఎమ్మెల్యేలు..?

టీడీపీ మొద‌లుపెట్టిన `ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌` దెబ్బ‌కు ప్ర‌తిప‌క్ష వైసీపీ గిల‌గిలా కొట్టుకుని విల‌విల్లాడిపోయింది. ఎన్నో ఆశ‌ల‌తో టీడీపీలోకి వెళ్లిన వారికి ఇప్పుడు అక్క‌డ ప్ర‌యారిటీ లేక‌పోవ‌డంతో వారంతా గోడ‌కు కొట్టిన బంతుల్లా రివ‌ర్స్ గేర్‌లో తిరిగి సొంత గూడు వైసీపీలోకి వెళ్లేందుకు రెడీ అవుతున్నార‌న్న వార్త‌లు ఏపీ పాలిటిక్స్‌లో ప్ర‌కంప‌న‌లు రేపుతున్నాయి.
నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న జ‌రుగుతుందో లేదో స్ప‌ష్టత లేక‌పోవ‌డం, మ‌రోప‌క్క వైసీపీ అధినేత ప్ర‌క‌టించిన న‌వ‌ర‌త్నాలు ప్ర‌జ‌ల్లోకి వెళ్లిపోవ‌డంతో ఇప్పుడు.. ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో అల‌జ‌డి మొదలైంది. సొంత గూటికి వెళ్లాల‌నే ఆలోచ‌న‌తో ఆరుగురు ఎమ్మెల్యేలు ఉన్నార‌ట‌. టీడీపీ ప్ర‌భుత్వంపై రోజు రోజుకు వ్య‌తిరేక‌త పెర‌గిపోతుండ‌డంతో పాటు వ‌చ్చే ఎన్నిక‌ల్లో సీటు గ్యారెంటీగా వ‌స్తుందో ?  లేదో ? అన్న సందేహంతో ఉన్న కొంద‌రు జంపింగ్ ఎమ్మెల్యేలు ఇప్పుడు తిరిగి పాత గూడులోకి చేరేందుకు రెడీ అవుతున్నారని తెలుస్తోంది.
క‌ర్నూలుకు చెందిన ఇద్ద‌రు ఎమ్మెల్యేలు, కోస్తాకు చెందిన మ‌రో ఇద్ద‌రు ఎమ్మెల్యేలతో పాటు ఒక ఎమ్మెల్సీ కూడా ఇప్పుడు యూ ట‌ర్న్ తీసుకునేందుకు సిద్ధ‌మ‌వుతున్నార‌ని తెలుస్తోంది. వీరితో పాటు ప్ర‌కాశం జిల్లాకు చెందిన మ‌రో ఇద్ద‌రు ఎమ్మెల్యేలు మరో అడుగు ముందుకేసి.. పార్టీలోకి తిరిగి వ‌చ్చేస్తామ‌ని త‌మ‌కు ట‌చ్‌లో ఉన్న వైసీపీ నేత‌ల‌తో రాయ‌బారాలు కూడా న‌డుపుతున్నార‌ట‌. మ‌రి అదే జ‌రిగితే ఏపీ పాలిటిక్స్ ఓ రేంజ్‌లో హీటెక్క‌డం ఖాయం.
Also Read; http://www.telugustarnews.com/telugu/tdp-mlc-jumpin-to-ysrcp/

విక‌టించిన ఆక‌ర్ష్‌: వైసీపీలోకి టీడీపీ ఎమ్మెల్సీ…

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *