గంటకి అతడి సంపాదన…16 వేల కోట్లు..!!!

మనిషి రోజు సంపాదన ఎంత ఉంటుంది..మహా అయితే 300 నుంచీ మొదలవుతుంది వారి వారి సంపాదన పద్దతులు, బిజినెస్ లను బట్టి ఓ లక్ష వరకూ ఉంటుంది. కానీ ఓ వ్యక్తి సంపాదన ఏకంగా గంటకి కోటి రూపాయలు ఉండటం విన్నారా…?? ఏంటి కోటి రూపాయలా అంటూ ఆశ్చర్యపోకండి, కోటికే అలా అంటే ఓ కంపెనీ సిఈవో సంపాదన ఏకంగా గంటకి 16 వేల కోట్లకి వెళ్ళింది…ఏంటి షాక్ అయ్యారా ఇప్పుడు నోళ్ళు వెళ్ళబెట్టండి. అంత డబ్బు గంటలో ఎలా సంపాదించాడో తెలుసుకోవాలని ఉందా…

Image result for space x ceo

 

స్పేస్ ఎక్స్ సీఈవో ఎలన్ మస్క్ ఏకంగా గంటలో 16 వేల కోట్లు సంపాదించాడు. ఎలా అంటే మార్కెట్లో టెస్లా కంపెనీ షేర్లు ఒక్క సారిగా పెరగడంతో అతడి సంపాదన గంటలో అన్ని కోట్లకి చేరుకుంది.మోడల్ వై కాశ్రోవార్ కార్ల యొక్క తయారీ వేగవంతంగా చేయడంతో తన షేర్స్ విపరీతంగా పెరిగిపోయాయి. టెస్లా లో ఎలన్ మస్క్ కి ఐదో వంతు షేర్లు ఉండగా కొన్ని రోజుల క్రితమే ఈ కంపెనీ మార్కెట్ విలువ 100 బిలియన్ డాలర్లు దాటింది. ఇదిలాఉంటే ఈ కంపెనీ 2025 కల్లా 30 లక్షల వాహనాలు అమ్మవచ్చు అనే అంచనాలు వేస్తున్నారు నిపుణులు. త్వరలో చైనా లో తన కార్ల కంపెనీ మొదలు పెట్టనున్న నేపధ్యంలోనే షేర్స్ విపరీతంగా పెరిగాయని అంటున్నారు నిపుణులు..

 

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *