ఎన్టీఆర్ దెబ్బ‌తో రికార్డు టీఆర్పీలు..

టాలీవుడ్ యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ తెలుగు షో మంచి అంచ‌నాల‌తో ప్రారంభ‌మైనా మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. షో అంచ‌నాలు అందుకోలేక‌పోవడం, పూర్ స్క్రిఫ్ట్‌, కంటెస్టెంట్లు వీక్‌గా ఉండ‌డంతో బిగ్ బాస్ షోకు అనుకున్న రేంజ్‌లో రెస్పాన్స్ రావ‌డం లేదు.

మిగిలిన రోజుల్లో ఈ షోకు రెస్పాన్స్ ఎలా ఉన్నా ఎన్టీఆర్ ఎపిసోడ్లు మాత్రం దుమ్ము రేపుతున్నాయి. ఎన్టీఆర్ వ‌స్తోన్న రోజులు మాత్రం స్టార్ మా ఛానెల్ యొక్క టీఆర్ఫీలు రికార్డ్ స్థాయిలో నమోదవుతున్నాయి. ఛానెల్ ప్రకటించిన అధికారిక సమాచారం ప్రకారం టీఆర్ఫీ 16.18 గా ఉంది. ఈ మధ్య కాలంలో ఒక ఛానెల్ కు ఇంతటి టీఆర్ఫీ రావడం ఇదే మొదటిసారి.
ఇక ఈ రియాలిటీ షోతో 4వ స్థానంలో ఉన్న స్టార్ మా ఛానెల్ మొదటి స్థానంలోకి రావడం మరొక విశేషం. ఇక రెండో వారంలోకి ఎంట‌ర్ అయిన ఈ షో ఇప్పుడిప్పుడే ర‌క్తి క‌డుతోంది. ఫ‌స్ట్ వారంలో జ్యోతి ఎలిమినేట్ అవ్వ‌గా, రెండో వారంలో బ‌ర్నింగ్‌స్టార్ సంపూర్ణేష్ షో నుంచి వెళ్లిపోయాడు. ఇక మ‌మైత్ సిట్ విచార‌ణ‌కు వ‌చ్చింది. మ‌రి ఇప్ప‌టి నుంచి అయినా ఈ షో ఎలా ర‌క్తిక‌ట్టిస్తుందో ?  చూడాలి.
Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *