మహేష్ అభిమానులకి అదిరిపోయే “గుడ్ న్యూస్”

సూపర్ స్టార్ మహేష్ బాబు తన తండ్రినుంచీ నటవారసత్వాన్ని అందుకున్న తరువాత ఎంతో తన ప్రత్యేకమైన నటనతో టాలీవుడ్ లోనే టాప్ హీరో స్థాయికి అనతికాలంలోనే ఎదిగిపోయాడు..భరత్ అనే నేను సినిమా తరువాత మహేష్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నటిస్తున్న చిత్రం మహర్షి..ఈ సినిమా విజయం పై మహేష్ పక్కా కాన్ఫిడెంట్ తో ఉన్నాడని తెలుస్తోంది…ఇదిలాఉంటే ఈ సినిమా ఫస్ట్ లుక్ ఎంత సంచలనం అభిమానులకి ఎంతటి సంతోషం ఇచ్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.అయితే ఈ సినిమాలో

Image result for maharshi movie mahesh babu

మహేష్ తో పాటుగా తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ నటిస్తున్నాడు అనే విషయం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలలో చెక్కర్లు కొడుతోంది..సూపర్ స్టార్ కృష్ణ అప్పట్లో తన సినిమాలలో మహేష్ బాబు బాలనటుడిగా పరిచయం చేశాడు..అంతేకాదు మహేష్ చే కీలక పాత్రలలో నటింప చేశాడు..అయితే ఈ తండ్రీ కొడుకుల కాంబినేషన్ అప్పుడు చూడటం తప్ప ఇంకెప్పుడు చూడలేదు దాంతో

Image result for mahesh babu with krishna

మహేష్ తన మహర్షి సినిమాలో తండ్రితో కలిసి నటించడానికి ప్లాన్ చేశాడట అంతేకాదు ఓ కీలక పాత్రలో కృష్ణ నటిస్తున్నారట.అయితే ఈ విషయం అధికారికంగా ప్రకటించకపోయినా ఈ వార్తల్లో నిజం లేకపోలేదని అంటున్నాయి సినిమా వర్గాలు..ఇదే గనుక నిజమైతే తప్పకుండా సూపర్ స్టార్ అభిమానులకి పండగలాంటి వార్తేనని చెప్పాలి.

 

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *