సూపర్ స్టార్ కృష్ణ ఫోటో పై తప్పుడు ప్రచారం…అసలు స్టొరీ ఇదీ….
సూపర్ స్టార్ కృష్ణ మృతి చెందడంతో తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తం శోక సంద్రంలో మునిగిపోయింది. ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు, సన్నిహితులు అందరూ కృష్ణ గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తున్నారు. మరో వైపు ఆయన మృతికి సంతాపంగా సినిమా షూటింగ్ లు వాయిదా వేయగా తెలుగు ఫిల్మ్ చాంబర్ వారు కీలక నిర్ణయం తీసుకున్నారు విజయవాడకు కృష్ణ గారికి మంచి అనుభంధం ఉందని అందుకే రేపటి రోజున విజయవాడలో సినిమా ప్రదర్సనను నిలిపివేస్తున్నట్టుగా ప్రకటించారు. ఇదిలాఉంటే

ప్రస్తుతం సూపర్ స్టార్ కృష్ణ గారి ఫోటో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఆ ఫోటో లో కృష్ణ సహజ రూపంతో ఎలాంటి మేకప్ లేకుండా , మేడలో పూల దండలు వేసుకుని, నిరసన తెలుపుతున్నట్టుగా ఉంది. దాంతో కొందరు ఆ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ప్రత్యేక ఆంద్ర రాష్ట్రం కోసం పొట్టి శ్రీ రాములు గారు నిరవధిక నిరాహార దీక్ష చేస్తుంటే తెలుగు హీరోలు ఎవరూ ఆ దీక్షకు మద్దతు ఇవ్వలేదని కానీ సూపర్ స్టార్ కృష్ణ గారు ఎంతో ధైర్యంగా బయటకు వచ్చి పొట్టి శ్రీరాములు గారికి మద్దతు ఇచ్చారని, ఆయన ఎంతో త్యాగం చేశారంటూ రాసుకొచ్చారు. దాంతో ఆ ఫోటో కాస్తా వైరల్ అయ్యింది. అయితే
కృష్ణ గారి ఫోటో పై జరుగుతున్న ఈ ప్రచారం తప్పు అంటున్నారు కొందరు. అంతేకాదు వివరణ కూడా ఇస్తున్నారు. పొట్టి శ్రీరాములు గారు ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం నిరాహార దీక్ష చేపట్టి మృతి చెందింది 1952 లో కానీ కృష్ణ గారు పుట్టింది 1943 లో అప్పటికి కృష్ణ గారి వయసు 9 ఏళ్ళు ఉంటుంది. అలాంటప్పుడు ఆ దీక్షలో ఎలా పాల్గొంటారని అంటున్నారు. ఇంతకీ ఆ ఫోటో ఏ సందర్భంలోనిదంటే.. 1918 లో నిజాం తీసుకువచ్చిన కొన్ని రూల్స్ ను రాజ్యాంగానికి విరుద్దమని రద్దు చేయగా, మరలా వాటిని 1972 లో సుప్రీంకోర్టు అమలు చేయడానికి తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుకు వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమమే జై ఆంధ్రా. నిజాం రూల్ ప్రకారం హైదరాబాద్ సంస్థానంలో పుట్టిన వాళ్ళు లేదా హైదరాబాదు లో 15 ఏళ్ళుగా ఉంటున్న వాళ్ళు మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హులుగా ఉండేవారు సుప్రీంకోర్టు దీనికి అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో ఒక్క ఆంధ్రుడికి కూడా జాబులు వచ్చే పరిస్థితి లేకపోవడంతో తీర్పుకు వ్యతిరేకంగా ఉద్యమం సాగింది. ఈ ఉద్యమం మరింత బలంగా మారుతున్న తరుణంలో
ఇందిరాగాంధీ హయంలో ఈ ఉద్యమంపై అణిచివేత జరిగింది, ఈ క్రమంలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. దాంతో ఈ ఉద్యమానికి మరింత బలం చేకూరింది. అప్పట్లో మద్రాసు లో ఉన్న తెలుగు సినిమా పరిశ్రమ నుంచీ మద్దతు ఇచ్చేందుకు అందరిలో చలనం కలిగేలా చేసేందుకు ప్రధాన కారకుడు మన సూపర్ స్టార్ కృష్ణ మాత్రమే. ఆయన ఎంట్రీ తో మరికొందరు మహా నటులు కూడా కృష్ణ కు మద్దతుగా నిలిచారు. అంతేకాదు కృష్ణ ఈ ఉద్యమంలో భాగంగా మారి 24 గంటలు నిరాహారదీక్షను చేపట్టారు. ఆనాటి ఫొటోనే ఇది..అయితే తెలియని వాళ్ళు పొట్టి శ్రీరాములు గారితో కలిసి దీక్షలో పాల్గొన్నారని ప్రచారం చేస్తున్నారు.