టీడీపీ కి మరో పెద్ద షాక్.. ఎమ్మెల్సీ రాజీనామా…!!

ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ లో నెలకొన్న రాజకీయ పరిస్థుతులను అంచనా వేయటం కష్టతరమైన విషయమే. రాజధాని విషయమై శాసనసభలో చర్చలు జరుగుతున్నాయి. అధికార పక్షం చూపిస్తున్న పాత లెక్కలు, అడుగుతున్న ప్రశ్నలతో సతమవుతున్న టీడీపీ కి మరో పెద్ద షాక్ తగిలింది. టీడీపీ పార్టీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆయన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా విషయమై ఆయన తన సన్నిహితులతో చెప్పినట్లు తెలిసింది.

మొదటి రోజు మండలి సమావేశానికి హాజరైన డొక్కా, రెండవరోజు  గైర్హాజరు అయ్యారు. ఇదిలా ఉంటే.. మరో టీడీపీ ఎమ్మెల్సీ శమంతకమణి తన అనారోగ్యం కారణంగా సమావేశాలకు హాజరు కాలేదు. శాసన సభ లో డొక్కా, జగన్ మోహన్ రెడ్డి తో ఎంతో సన్నిహితంగా ఉన్నారు. దగ్గరకు వచ్చి నవ్వుతు పలకరించారు. ఈ విషయమై ఇప్పుడు, టీడీపీ పార్టీ లో కొత్త చర్చ మొదలయింది.

 

 

 

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *