నంద్యాల‌లో టీడీపీ చీటింగ్ ప్లాన్ చిత్తు…

నంద్యాల ఉప ఎన్నికల వేళ టీడీపీకి వ‌రుస‌గా షాకుల మీద షాకులు త‌గులుతున్నాయి. ఇక్క‌డ గత వారం రోజుల్లో ముగ్గురు కీల‌క వ్య‌క్తులు వైసీపీలో చేరిపోయారు. మాజీ ఎమ్మెల్యే సంజీవ‌రెడ్డి, నియోజ‌క‌వ‌ర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ రాకేశ్‌రెడ్డి, టీడీపీ కౌన్సెల‌ర్ హ‌నీఫ్ ఈ ముగ్గురూ వైసీపీలో చేరిపోయారు. ఇక మ‌రో పెద్ద షాక్ ఏంటంటే టీడీపీ ఎమ్మెల్సీ శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డి కూడా వైసీపీలో చేరిపోతుండ‌డంతో టీడీపీ ఎన్నిక‌కు ముందే చేతులెత్తేసినట్టు క‌న‌ప‌డుతోంది.


ఇదిలా ఉంటే ఇక్క‌డ గెలుపుకోసం టీడీపీ వేసిన ఓ చీటింగ్ ప్లాన్ వైసీపీ అలెర్ట్ అవ్వ‌డంతో ముందే చిత్త‌య్యింది. ఈ విష‌యంలో వైసీపీ ఏ మాత్రం ఏమ‌రుపాటుగా ఉన్నా వైసీపీ గ్యారెంటీగా ఓడిపోయేదేమో. గ‌త నాలుగు నెల‌లుగా టీడీపీ నియోజ‌క‌వ‌ర్గంలో ఏకంగా 10 వేల దొంగ ఓట్ల‌ను చేర్పించినట్టు ఈసీ లోతుగా చేయించిన విచార‌ణ‌తో అస‌లు విష‌యం వెలుగులోకి వ‌చ్చింది.

గ‌త జూలైలో నంద్యాల నియోజకవర్గ పరిధిలో ఏకంగా 11,502 కొత్త ఓట్ల దరఖాస్తులు వచ్చాయి. వీటిలో ఒకే ఐపీ అడ్ర‌స్ నుంచి ఏకంగా 5 వేల ద‌ర‌ఖాస్తులు వ‌చ్చాయి. అయితే ఇక్క‌డ ఎప్ప‌టిక‌ప్పుడు ఎలెర్ట్‌గా ఉంటోన్న వైసీపీ టీడీపీ ప్లాన్‌ను చిత్తు చేసింది. వైసీపీ ఈసీకి ఫిర్యాదు చేయ‌గా, ఈసీ ఈ విష‌యంపై లోతుగా ప‌రిశీల‌న చేయ‌డంతో  ఈ దొంగ ఓట్ల వ్య‌వ‌హారం బ‌య‌ట‌కు వ‌చ్చింది. దీంతో ఈసీ ఈ జ‌న‌వ‌రి 1 వ‌ర‌కు ఉన్న ఓట‌ర్లే ఈ ఎన్నిక‌ల్లో ఓట్లేసేందుకు అర్హుల‌ని చెప్ప‌డంతో టీడీపీకి షాక్ త‌గ‌ల‌క త‌ప్ప‌లేదు.

Also Read: http://www.telugustarnews.com/telugu/pavankalyan-u-turnbabu-shock/

బాబుకి షాక్ ఇవ్వబోతున్న పవన్…

 

 
 
 
Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *